హోమ్ /వార్తలు /national /

కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు ఘోర అవమానం...

కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు ఘోర అవమానం...

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ఒకప్పుడు కరీంనగర్ కార్పొరేషన్‌లో చైర్మన్ పదవులు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు 60 స్థానాలున్న కార్పొరేషన్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

  తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎప్పుడు నిలదొక్కుకుంటుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అయితే మళ్లీ పార్టీని గెలిపించుకోవడం కోసం నేతలు మాత్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం కాంగ్రెస్‌కు కష్టంగానే ఉన్నా... కొన్ని చోట్ల మాత్రం ఆ పార్టీ నేతల గెలుపు కాంగ్రెస్ శ్రేణులకు ఊరట కలిగించింది. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

  ఒకప్పుడు కరీంనగర్ కార్పొరేషన్‌లో చైర్మన్ పదవులు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు 60 స్థానాలున్న కార్పొరేషన్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 60 స్థానాలున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ 34, బీజేపీ 12, ఎంఐఎం 6, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. కనీసం ఇండిపెండెంట్ల స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. అయితే కరీంనగర్‌లో బీజేపీ బలపడటం వల్లే కాంగ్రెస్ ఓటర్లు బీజేపీ వైపు చూశారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి కరీంనగర్ వంటి కీలకమైన కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడం ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితిని సూచిస్తోందనే చర్చ జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Congress, Karimangar, Trs

  ఉత్తమ కథలు