Home /News /national /

POLITICS CONGRESS NEW CONDITION TO KODANDARAM FOR SUPPORT IN MLC ELECTIONS AK

Kodandaram: డైలమాలో కోదండరామ్.. కొత్త మెలిక పెట్టిన కాంగ్రెస్

ప్రొఫెసర్ కోదండరాం (ఫైల్ ఫోటో)

ప్రొఫెసర్ కోదండరాం (ఫైల్ ఫోటో)

Kodandaram: కోదండరామ్‌కు మరోసారి మద్దతు ఇచ్చి.. ఆయనకు అనవసర ప్రాధాన్యత ఇవ్వొద్దని కొందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నాయకత్వానికి సూచించినట్టు సమాచారం.

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కోదండరామ్ ఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు. ఉద్యమ సమయంలో వ్యూహరచన కేసీఆర్‌‌ది అయినా.. వాటిని అమలు చేసే బాధ్యతను కోదండరామ్ తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర పౌర సంఘాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాజకీయంగా కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అధినాయకత్వంతోనూ అప్పట్లో కోదండరామ్ చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్‌తో విభేదాల కారణంగా ఆయన ప్రత్యర్థుల లిస్టులో చేరిపోయారు కోదండరామ్‌. దీంతో తన ప్రత్యర్థుల తరహాలోనే కోదండరామ్‌ను సైతం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో న్యూట్రైలైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

    ఆ తరువాత కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కోదండరామ్.. గత ఎన్నికల్లో ఆ దిశగా విజయం సాధించలేకపోయారు. తాజాగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టుభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు కాంగ్రెస్ నుంచి కచ్చితంగా లభిస్తుందనే భావనలో ఉన్న కోదండరామ్‌... ఆ పార్టీతో ఎప్పటికప్పుడు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారనే వాదన ఉంది.

    అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో కోదండరామ్‌కు మద్దతు ఇవ్వడానికి సుముఖంగా లేదనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఒకవేళ కోదండరామ్‌కు తమ మద్దతు కావాలని అనుకుంటే.. ఆయనను కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంటే కోదండరామ్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న మాట. ఇలా చేస్తే కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగొచ్చని కొందరు నేతలు సూచించినట్టు తెలుస్తోంది.

    కోదండరామ్‌కు మరోసారి మద్దతు ఇచ్చి.. ఆయనకు అనవసర ప్రాధాన్యత ఇవ్వొద్దని కొందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నాయకత్వానికి సూచించినట్టు సమాచారం. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే.. ఆయన టికెట్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించబోమని వారంతా పార్టీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీగా గెలిచి తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న కోదండరామ్‌కు కాంగ్రెస్ ఊహించని షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Kodandaram, Telangana, Telangana mlc election

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు