హోమ్ /వార్తలు /national /

ఇదేనా కరీంనగర్ పౌరుషం...ఈటలపై ఎంపీ రేవంత్ రెడ్డి సెటైర్లు

ఇదేనా కరీంనగర్ పౌరుషం...ఈటలపై ఎంపీ రేవంత్ రెడ్డి సెటైర్లు

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి

ఈటల వ్యాఖ్యలతో ఏదో జరగబోతోందని ఊహించుకున్నామని..కేటీఆర్ ఒక్క ఫోన్ చేయగానే తుస్సుమన్నారని ఎద్దేవా చేశారు రేవంత్. ఇదేనా కరీంనగర్ పౌరుషం..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  తెలంగాణ రాజకీయాల్లో మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పదవి నుంచి ఈటలను తప్పిస్తారని ప్రచారం జరగడం, మంత్రి పదవి తనకు బిక్ష కాదని..తాము గులాబీ జెండా ఓనర్లమని సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ వెంటనే కేసీఆర్‌ను పొగడం...ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఈటల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈటల వ్యాఖ్యలతో ఏదో జరగబోతోందని ఊహించుకున్నామని..కేటీఆర్ ఒక్క ఫోన్ చేయగానే తుస్సుమన్నారని ఎద్దేవా చేశారు రేవంత్. ఇదేనా కరీంనగర్ పౌరుషం..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  ఈటల మాటలతో టీఆర్ఎస్‌లో భూకంపం పుట్టిందనుకున్నాం. ఏదో జరగబోతోందని ఊహించుకున్నాం. కానీ కేటీఆర్ ఒక్క ఫోన్ చేయగానే ఈటెల రాజేందర్ తన మాటలను వెనక్కి తీసుకొని తస్సుమనిపించారు. ఇదేనా కరీంనగర్ పౌరుషం? అధికార పార్టీ అంతా దొంగల బండే. మిడ్ మానేరు నిర్వాసితులకు అండగా ఉంటాం. కేసీఆర్ తెలంగాణ ద్రోహి. కేసీఆర్ తీరుతో తెలంగాణలో ఎవ్వరూ సంతోషంగా లేరు.
  రేవంత్ రెడ్డి

  గురువారం హుజూరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవి బిక్ష కాదని... తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని... ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని, బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదన్నారు ఈటెల రాజేందర్. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని ఈటల అన్నారు. కుహనావాదుల పట్ల, కుసంస్కారుల పట్ల, సొంతగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఐతే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు ఈటల. తన ప్ర‌సంగాన్ని కొన్ని వార్త ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలోని కొన్ని వ‌ర్గాలు వ‌క్రీక‌రించాయని ఆరోపించారు. తమ నాయకుడు కేసీఆరేనని..తానుగులాబీ సైనికుడిని స్పష్టంచేశారు. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు ఈటల.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Etela rajender, KTR, Revanth Reddy, Telangana, Trs

  ఉత్తమ కథలు