హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి

Dubbaka ByPoll: కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నికల పోరు రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

  దుబ్బాక ఉప ఎన్నికల పోరు రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. తొలుత మిరుదొడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత కామిల్ల మర్రి వద్ద రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికను అవకాశంగా తీసుకుని తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దుబ్బాకలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిన తర్వాత ఎలాంటి అభివృద్ది జరగలేదని అన్నారు.

  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చెరుకు ముత్యంరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో దొమ్మాట ముత్యంరెడ్డిగా గుర్తింపు పొందారని రేవంత్ అన్నారు. ఇక్కడ ప్రజల గౌరవాన్ని ముత్యంరెడ్డి నిలబెట్టారని తెలిపారు. ఇక్కడ నాలుగుసార్లు టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. గిరిజన, దళిత, బీసీ వర్గాలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కింద రైతుల భూములు పోయాయని ఊరు మాత్రమే మిగిలిందని అన్నారు. ఇక్కడ బాత్‌రూమ్‌లలో నుంచి నీళ్లు ఊబికి వస్తున్న పట్టించుకునే వారే లేరని విమర్శించారు.

  ముత్యం రెడ్డికి అన్యాయం చేసిన టీఆర్ఎస్ ఆయన కుమారుడికి కూడా అన్యాయం చేసిందన్నారు. దుబ్బాక ప్రజలు నాలుగు కోట్ల ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించే గొంతుకను గెలిపించి..శాసనసభకు పంపించాలని పిలపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. శ్రీనివాస్‌రెడ్డిని మీ బిడ్డగా, సోదరుడిగా ఆదరించాలని.. ఇదంతా ముత్యంరెడ్డి స్వర్గంనుంచి చూస్తుంటారని చెప్పారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Congress, Dubbaka By Elections 2020, Revanth reddy

  ఉత్తమ కథలు