హోమ్ /వార్తలు /national /

Telangana Politics: సీఎం కేసీఆర్​పై ఎంపీ కోమటిరెడ్డి ప్రశంసలు.. ఆదాయం లేకున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని వ్యాఖ్య

Telangana Politics: సీఎం కేసీఆర్​పై ఎంపీ కోమటిరెడ్డి ప్రశంసలు.. ఆదాయం లేకున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని వ్యాఖ్య

mp komatireddy

mp komatireddy

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( MP Komatireddy Venkat Reddy) ప్రశంసల వర్షం కురిపించారు. జనగామ జిల్లా కలెక్టర్ (jangaon collectorate) కార్యాలయ భవన సముదాయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ (kcr) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( MP Komatireddy Venkat Reddy) ప్రశంసల వర్షం కురిపించారు. జనగామ జిల్లా కలెక్టర్ (jangaon collectorate) కార్యాలయ భవన సముదాయాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం ప్రసంగం అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంటు నియోజకవర్గం అయిన జనగామలో అద్భుత కలెక్టరేట్ భవనం కట్టించినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోరాటాలకు మారుపేరుగా ఉన్న జనగామలో చేర్యాల నియోజకవర్గం కూడా కలపాలని కోరారు. దాన్ని రెవెన్యూ డివిజన్ కావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ‘జనగామకు మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఇస్తామని గతంలో మీరు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అవి తెస్తారని తనకు నమ్మకం ఉందని, బస్టాండ్ సమస్యను కూడా పరిష్కరించాలని సీఎం కేసీఆర్​ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కోరారు.

మనం మనం కొట్లాడుకోవద్దు..

పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలన్నారు. తెలంగాణను 33 జిల్లాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కలెక్టరేట్లలా కూడా సచివాలయాలు లేవని.. ఆదాయం లేకున్నా రెండేళ్లుగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని కోమటిరెడ్డి ప్రశంసించారు. తెలంగాణ వచ్చింది.. మనం మనం కొట్లాడుకోవద్దని కోమటిరెడ్డి హితవు పలికారు. తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు వద్దని వెంకటరెడ్డి సూచించారు.

సీఎం అలా అనడం సరికాదు..

మరోవైపు కోమటిరెడ్డి సీఎంపై కొన్ని విమర్శలు సైతం చేశారు. 15 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం‌.. భువనగిరి సందర్శించకపోవడం బాధాకరమన్నారు కోమటిరెడ్డి. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనడం భావ్యం కాదని.. వెంటనే సీఎం కేసీఆర్‌ ఆ మాటలు ఉపసంహరించుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద ప్రగతి భవన్ నిర్మించిన సీఎం.. 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. శనివారం భువనగిరిలో జరిగే సీఎం కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తామని ఆయన చెప్పారు. ఆలేరు, భువనగిరి నియోజక వర్గాల సమస్యలను తెలుపుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

రాజకీయాల్లో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఆసక్తి కలిగిస్తుంటాయి. ముఖ్యంగా రాజకీయ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం ప్రోటోకాల్‌కు మాత్రమే పరిమితమవుతుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు భిన్నమైన దృశ్యాలు, పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లా కొత్త కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇలాంటి ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది.

ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మిగతా ప్రజాప్రతినిధుల తరహాలోనే కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి.. సీఎం కేసీఆర్ ఊహించని ప్రాధాన్యత ఇచ్చారు. కార్యాలయం ప్రారంభోత్సం సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో దగ్గరుండి మరీ కొబ్బరికాయ కొట్టించారు. మీరే కొట్టండని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పట్టుబడి మరీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొబ్బరికాయ కొట్టించారు.

First published:

Tags: CM KCR, Komatireddy venkat reddy, Nalgonda

ఉత్తమ కథలు