నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మాజీ ఎంపీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కవిత రాష్ట్ర నాయకురాలు అని వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి... ఆమె సేవలు రాష్ట్రానికి అవసరమని అన్నారు. కవిత కేవలం నిజామాబాద్‌కే పరిమితం కావద్దని జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కి కవిత సేవలు అవసరం, అందుకే ఆమెకు బాధ్యతలు ఇచ్చారని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కవిత ఓటమి తనను బాధించిందని జీవన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని... ఓడినప్పుడు నేతలకు మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పారు.
ఏ పదవి ఇచ్చిన కవిత సక్సెస్ అవుతారని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో కవిత ప్రాతినిథ్యం వహించిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించేందుకు కవిత వ్యూహరచన చేశారు. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయేలా చేశారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి శాసనమండలిలో అడుగుపెట్టారు జీవన్ రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jeevan reddy, Kalvakuntla Kavitha, Telangana, Trs