హోమ్ /వార్తలు /national /

Telangana Assembly: రూ. 3 లక్షలు ఎలా సరిపోతాయి.. రూ.8 లక్షలివ్వాలి.. డబుల్​బెడ్​రూం ఇళ్లపై ప్రభుత్వానికి కాంగ్రెస్​ డిమాండ్​

Telangana Assembly: రూ. 3 లక్షలు ఎలా సరిపోతాయి.. రూ.8 లక్షలివ్వాలి.. డబుల్​బెడ్​రూం ఇళ్లపై ప్రభుత్వానికి కాంగ్రెస్​ డిమాండ్​

భట్టి విక్రమార్క (ఫైల్​)

భట్టి విక్రమార్క (ఫైల్​)

తెలంగాణ బడ్జెట్​ 2022ను ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ బడ్జెట్​ అంటూ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సమర్థించుకున్నారు. అయితే ఆ బడ్జెట్​పై కాంగ్రెస్​ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti vikramarka) అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. 

ఇంకా చదవండి ...

అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly) మొదటి రోజున తెలంగాణ బడ్జెట్​ 2022 (Telangana Budget 2022)ను ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ బడ్జెట్​ అంటూ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సమర్థించుకున్నారు. అయితే ఆ బడ్జెట్​పై కాంగ్రెస్​ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti vikramarka) అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.8 లక్షలు ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. కార్పొరేటర్​ బడ్జెట్ కాదన్నారని.. పేదలకు ఏం దక్కిందని ప్రశ్నించారు. వున్న సబ్సిడీలు ఎత్తేసి ధరలు పెంచితే రైతులకు మేలు జరుగుతుందా అని భట్టి వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు కావడం లేదని భట్టి ఎద్దేవా చేశారు. సంపద పెరుగుతుందంటూనే, అప్పులు పెంచారని ఆయన దుయ్యబట్టారు. 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

మంత్రి హత్యకు సుపారీ తీసుకున్నారంటే తెలంగాణలో ఏం జరుగుతోందని భట్టీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో (Telangana Assembly) నిలదీశారు. ఇక మంత్రికే భద్రత లేనప్పుడు, సామాన్యుల పరిస్ధితేంటని భట్టి ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర గురించిన వాస్తవాలను రాష్ట్రప్రజలకు తెలియజేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు. మంథనిలో పట్టపగలు న్యాయవాద దంపతులను హత్య చేశారని గుర్తుచేశారు.

గీత కార్మికుల పెన్షన్​ హామీ నిలబెట్టుకోవాలి..

ధూప దీప నైవేద్యాల కోసం పూజారులకు ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని భట్టి అసెంబ్లీలో (Telangana Assembly) డిమాండ్ చేశారు. గీత కార్మికుల ఇస్తామన్న పెన్షన్ హామీని కూడా నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యోగులకు మేలు చేయాలని భట్టీ డిమాండ్​ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ  సందర్భంగా కోరారు.

కొన్ని సందేహాలున్నాయి..

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లు, ఇబ్బందులకు సంబంధించి కేసీఆర్ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. 35 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందుతున్నట్లు చెబుతున్నారని,  దీనిపై  కొన్ని సందేహాలు వున్నాయని.. వాటిని నివృత్తి చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఇదే సందర్భంగా కేఆర్ఎంబీ (krmb) , జీఆర్ఎంబీలు (grmb) ప్రాజెక్ట్‌లను తమకు అప్పగించాలని కోరుతున్నాయని భట్టీ గుర్తుచేశారు. ఇంకోసారి ఇవన్నీ అక్రమ ప్రాజెక్ట్‌లనీ పనులు ఆపాలని చెబుతున్నాయని .. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నదీ జలాల గురించి అని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని.. రేపు అనుమతులు పేరు చెప్పి వీటికి అడ్డు తగిలితే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇవి కాకుండా సంగమేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (rayalaseema lift irrigation project) నిర్మిస్తోందని చెప్పారు. అదే జరిగితే సాగర్ కింద వున్న నల్గొండ జిల్లా పూర్తిగా ఏడారిగా మారిపోతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

First published:

Tags: Bhatti Vikramarka, Telangana Assembly, Telangana Budget 2022, Telangana Politics

ఉత్తమ కథలు