హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sonia Gandhi: రాజకీయాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ గుడ్‌ బై..! ఆ మాటలకు అర్దం అదేనా..?

Sonia Gandhi: రాజకీయాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ గుడ్‌ బై..! ఆ మాటలకు అర్దం అదేనా..?

Sonia Gandhi(Photo:Twitter)

Sonia Gandhi(Photo:Twitter)

Sonia Gandhi:ఇక చాలు. నా ఇన్నింగ్స్ ముగిస్తా..? కాంగ్రెస్ నాయకురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకరకంగా ఆమె రాజకీయలకు గుడ్‌ బై చెప్పినట్లేనని భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Raipur, India

ఒక జాతీయ పార్టీకి దశాబ్ధాల కాలం పాటు నాయకత్వం వహిస్తున్న నాయకురాలు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారా..? కాంగ్రెస్ (Congress)అంటే సోనియాగాంధీ ..సోనియాగాంధీ (Sonia Gandhi)అంటే కాంగ్రెస్‌ అనే విధంగా పార్టీని కమాండ్‌ చేయడం, నాయకులకు దిశానిర్దేశం చేయగల సమర్ధురాలు నోటి వెంట నుంచి ఇక చాలు.. నా ఇన్నింగ్స్‌ ముగుస్తుందని చెప్పడం వెనుక నూటికి నూరు శాతం ఆమె రాజకీయాల నుంచి వైదొలగుతున్నారనే(Retirement)ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నారనే వార్తలకు ఛత్తీస్‌గడ్‌(Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్‌(Raipur)లో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ 85ప్లీనరీ వేడుకల్లో ఆమె చేసిన వ్యాఖ్యలే ఆధారంగా కనిపిస్తున్నాయి.

రాజకీయాల నుంచి వైదొలగుతారా ..

సుధీర్ఘ రాజకీయ అనుభవం. దేశాన్ని అనేక ఏళ్లుగా పాలించిన పార్టీకి అధ్యక్షురాలిగా పని చేసిన అర్హత కలిగిన కాంగ్రెస్ ఎంపీ , యూపీఏ చైర్ పర్సన్‌ సోనియాగాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిగ్‌గా మారాయి. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈవేదికపై కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఉద్వేగతభరితమైన ప్రసంగం అందర్ని ఆలోచించేలా చేసింది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సక్సెస్‌తో తన ఇన్నింగ్స్‌ ముగుస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. అంటే మేడమ్ సోనియా రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటానని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లుగా చూస్తున్నారు.

భారత్‌ జోడో యాత్ర టర్నింగ్ పాయింట్..

కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌పై తనకు గట్టి నమ్మకం ఉందన్న సోనియాగాంధీ.. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో 2004,2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇక భారత్‌ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్‌ ముగుస్తుందన్న సోనియా ..ఆ యాత్ర కూడా తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అదే టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు. 2024ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాను తన వ్యాఖ్యల్లో చూపించారు కాంగ్రెస్ నాయకురాలు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణంలో రామ్ అనే ఇటుక.. ఇదే ప్రత్యేకత

సర్వనాశనం చేసింది బీజేపీనే..

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీతో పాటు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు సోనియాగాంధీ. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు కలిసి దేశంలోని అన్నీ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని 2024ఎన్నికలే ఎజెండాగా సోనియాగాంధీ విమర్శలు చేశారు. కొంతమంది వ్యాపారవేత్తలకు బీజేపీ అనుకూలంగా వ్యవహరించడం వల్లే దేశ ఆర్థిక పరిస్థితికి కారణమైందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వం కోసం ఎదురుచూస్తున్నారని భారత్ జోడో యాత్ర ద్వారా తెలిసిపోయిందన్నారు.

పూర్వ వైభవం వచ్చేనా ..

రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు పార్టీలో కొత్త జోష్‌ని నింపాయి. సుమారు 1500మంది నాయకులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇక కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీకి స్వాగతం పలుకుతూ దారి పొడవున గులాబీ పూల రేకులను పరిచారు.

First published:

Tags: Congress, National News, Sonia Gandhi

ఉత్తమ కథలు