Home /News /national /

POLITICS CONGRESS LEADER REVANTHREDDY COMMENTS ON DUBBAKA ELECTION RESULTS NS

Revanth Reddy: దుబ్బాకలో రఘునందన్ గెలుపు వన్ టైం వండర్.. బీజేపీ, టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

ప్రస్తుతం బీజేపీలో ఉన్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర వాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వన్ టైమ్ వండర్ అని ఆలత అభివర్ణించారు. ఈ వన్ టైమ్ వండర్లు బీజేపీ విషయంలో చాలా సార్లు జరిగాయని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...
  టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర వాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వన్ టైమ్ వండర్ అని ఆలత అభివర్ణించారు. ఈ వన్ టైమ్ వండర్లు బీజేపీ విషయంలో చాలా సార్లు జరిగాయని ఎద్దేవా చేశారు. 2012లో మహబూబ్‌నగర్‌లో ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నెం శ్రీనివాసరెడ్డి గెలుపొందారని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ బీజేపీకి తెలంగాణలో ఇక ఎదురు లేదని ఆ పార్టీ ప్రచారం చేసుకుందని గుర్తు చేశారు. అయితే అనంతరం ఏమైందని ప్రశ్నించారు. 2014లో బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారన్నారు. అయితే 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన 105 మందికి డిపాజిట్లు పోయాయన్నారు.

  2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందినా.. అనంతరం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి అభ్యర్థులే లేరని రేవంత్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో బిల్లులు పాస్ చేసుకోవడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో కలిసి నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు.

  గతంలో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో టీఆర్ఎస్ సహకరించిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దుబ్బాకలో రఘునందన్ గెలుపుకు గల కారణాలను తాను తర్వాత చెబుతానన్నారు. టీఆర్ఎస్ లో ఎవరు రఘునందర్ కు నగదు బదిలీ చేశారు?, ఎవరు ఓట్లు బదిలీ చేశారు? అన్న విషయాలు బయటపెడతానన్నారు. దుబ్బాకలో కులం గెలిచింది.. కానీ ప్రజలు గెలవలేదని ప్రజలు భావిస్తున్నారంటూ సంచలన వాఖ్యలు చేశారు రేవంత్.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Kishan Reddy, Revanth reddy

  తదుపరి వార్తలు