కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతుల్లోంచి మరో వ్యక్తి చేతుల్లోకి వెళతాయా ? అన్న సస్పెన్స్ చాలాకాలంగా సాగుతోంది. త్వరలోనే ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఈ పదవి చేపడతారా ? లేదా ? అన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆయన ఈ పదవిని మరోసారి చేపట్టేందుకు సముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ గాంధీనే ఈ పదవిని చేపట్టాలని పదే పదే కోరుతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో(Bharat Jodo) పేరు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) .. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై మరోసారి స్పందించారు. తాను ఇప్పటికే తన నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడబోనని.. సమయం వచ్చినప్పుడు దాని గురించి చెబుతానని అన్నారు.ఎన్నికలు జరిగినప్పుడు, తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానో లేదో స్పష్టమవుతుందని.. దయచేసి అప్పటి వరకు వేచి ఉండాలని అన్నారు. ఒకవేళ తాను ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. ఎందుకు చేయలేదో కూడా సమాధానం చెబుతానని రాహుల్ గాంధీ చెప్పారు. అదే సమయంలో తన పాదయాత్ర సందర్భంగా ప్రధాని మోదీకి ఎలాంటి సందేశం ఇచ్చే ఆలోచన తనకు లేదని అన్నారు.
పాదయాత్ర అట్టడుగు స్థాయిలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నమని, కన్యాకుమారిలో 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను రక్షించేందుకే ఈ యాత్ర చేపట్టారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని అన్నారు.
Queen elizabeth 2: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 అస్తమయం.. భారత ప్రభుత్వ కీలక నిర్ణయం..
Kartavya Path: రాజ్‌పథ్ ఇక చరిత్ర.. బానిసత్వం నుంచి విముక్తి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కానీ ప్రజలతో మమేకం కావడానికే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని సంస్థలు.. ఇప్పుడు బిజెపి నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్న రాహుల్ గాంధీతో సహా 119 మంది నేతలను 'భారత్ యాత్రికులు'గా కాంగ్రెస్ పేర్కొంది. మొత్తం 3,570 కి.మీ. భారత జోడో యాత్రలో భాగంగా ఈ రోజు మూడో రోజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Rahul Gandhi