Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీనితో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు కీలక హామీలిచ్చింది. ఇక ఇప్పుడు ఆ హామీలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న రాహుల్ గాంధీ..ఆ హామీలకు తొలి కేబినేట్ సమావేశంలో చట్టబద్దత తెస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడు హామీలు ఇవ్వదని..ఏది చేస్తామో అదే చెబుతామన్నారు. కాంగ్రెస్ వెంట పేదలు, దళితులు, ఆదివాసులు, వెనకబడిన తరగతులు ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలు ఇవే..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంటి ఖర్చుల కోసం గృహిణులకు నెలకు రూ.2000
200 యూనిట్ల ఉచిత విద్యుత్
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
నిరుద్యోగ గ్రాడ్యుయేట్ లకు ప్రతి నెల రూ.3000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రూ.1500
దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం
ఇక కన్నడలో శనివారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీనితో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య..ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. బెంగళూరులోని.. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ తావార్‌చంద్ గెహ్లాట్.. ఈ ఇద్దరి చేతా ప్రమాణాలు చేయించారు. అదే విధంగా.. మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఐతే.. ఇదే స్టేడియంలో 2013లో మొదటిసారి సీఎంగా ప్రమాణం చేసిన... సిద్ధరామయ్య ఇప్పుడు రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినట్లైంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏడు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
మొత్తంగా చూస్తే... కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చేసినంత జోష్ ఉంది. ఇదే ఉత్సాహంతో.. ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నిరంతరం ప్రజలతో మమేకమయ్యేలా వ్యూహాలు రచిస్తోంది. మరి కర్ణాటక ఫార్ములా.. ఇతర రాష్ట్రాల్లో వర్కవుట్ అవుతుందా అనేది ఆసక్తికరం. ఐతే.. ప్రతిపక్షాలు కాంగ్రెస్‌తో కలిసొస్తూ ఉండటం.. హస్తంలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతోంది. మొత్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక్కటవుతుండటాన్ని మనం గమనించవచ్చు. అందువల్ల మున్ముందు దేశ రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా సాగడం గ్యారెంటీ అనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Karnataka, Karnataka Elections, Rahul Gandhi