Marriage Proposal To Rahul Gandhi :బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)సెప్టెంబర్ 7న కన్యాకమారిలో ప్రారంభించారు. 150 రోజుల పాటు సాగే పాదయాత్రలో 12 రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. ఈ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడోరోజు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలను రాహుల్ కలుసుకుంటున్నారు.
తమిళనాడులో రాహుల్ గాంధీ మహిళలతో సంభాషిస్తున్నప్పుడు జరిగిన వినోదభరితమైన సంఘటనను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రాహుల్ ని కలుసుకోడానికి వచ్చిన తమిళనాడు మహిళా కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు.. ఆయన ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచారు. రాహుల్ గాంధీ తమిళనాడును ప్రేమిస్తున్నాడని తమకు తెలుసనని, అతడికి తమిళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓ మహిళ చెప్పింది. దీంతో రాహుల్ చిరునవ్వులు చిందించారు. సమాధానం చెప్పకుండానే ముందుకు సాగారు. ఈ వినోదకరమైన విషయాన్ని వెల్లడిస్తూ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర 3వ రోజు అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ రాహుల్ చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేశారు.
A hilarious moment from day 3 of #BharatJodoYatra During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022
ఒకరు టీచర్ తో,మరొకరు తమ్ముడి ఫ్రెండ్ తో..ప్రపంచ నేతల లవ్ స్టోరీ
మరోవైపు,భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తమిళనాడు(Tamilnadu)లో ఓ వివాదాస్పద పాస్టర్‌ను కలవడం విమర్శలకు తావిచ్చింది. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం(పెస్టెంబర్9,2022) కన్యాకుమారి జిల్లా పులియూర్కురిచిలోనిముట్టిదిచాన్ పారై చర్చిలో వివాదాస్పద కేథలిక్ మత గరువు జార్జ్ పూనయ్య(George Ponnaiah)ను రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ... యేసు క్రీస్తు(Jesus)దేవుడా? దేవుని రూపమా? అని జార్జ్ పూనయ్యను అడుగగా దానికి జార్జ్ స్పందిస్తూ.. "యేసు మాత్రమే అసలైన దేవుడు. దేవుడు ఒక నిజమైన మనిషిలానే అవతరిస్తాడు. "శక్తి"లా కాదు. అందుకే మనం మనిషినే చూస్తాం"అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా మాట్లాడుతూ.. "మతదురభిమానంతో కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు జార్జ్ పూనయ్య గతంలో అరెస్ట్ అయ్యారు. భారత్ తోడో(దేశాన్ని విడగొట్టే) శక్తులతో కలిసి భారత్ జోడో(భారత్‌ను ఐక్యం చేసే) యాత్ర చేస్తారా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. అయితే ఈ విమర్శల్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆడియోకు, అక్కడ జరిగినదానికి ఏమాత్రం సంబంధం లేకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Congress, Rahul Gandhi, Tamilnadu