హోమ్ /వార్తలు /national /

Telangana: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు.. ఢిల్లీ వెళ్లిన తరువాత..

Telangana: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు.. ఢిల్లీ వెళ్లిన తరువాత..

రైతు దీక్షలో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి

రైతు దీక్షలో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి

Telangana: తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని.. రైతు బంధు ఒట్టి మోసమని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి మొగుడిని అవుతానని ఢిల్లీకి పోయిన కేసీఆర్ ట్రాన్స్ జండర్ అయ్యాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ శిఖండిగా మారారని ఆరోపించారు. ఢిల్లీలో కేసీఆర్ మోదీ కాళ్ళు పట్టుకున్నాడని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని.. రైతు బంధు ఒట్టి మోసమని అన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పేదల బాధలు తెలిసిన మనిషి సోనియా గాంధీ అని వ్యాఖ్యానించారు.

శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టిన కేసీఆర్.. వ్యవసాయ చట్టంపై యూ టర్న్ తీసుకున్నాడని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాటం చేసిన పరంపరను కొనసాగించాలని సీనియర్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని అన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న సంఘాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని అన్నారు. ఢిల్లీ రైతుల కోసం జానారెడ్డి రూ.10 వేలు భట్టి విక్రమార్కకు ఇచ్చారు.

ఈ దీక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చంప పెట్టు లాంటిదని.. రైతుల పట్ల మోదీ, కేసీఆర్ మోడీ మొండి వైఖరి అవలంబిస్తున్నారని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని ప్రకటించిన నరేంద్రమోదీ.. ఇప్పుడు వారి గొంతు కొస్తున్నారని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలు వద్దన్న కేసీఆర్ డిల్లీకి వెళ్లొచ్చి చట్టాలు అమలు చేస్తానంటున్నాడని.. అవినీతి బయటపడకుండా ఉండేందుకే కేసీఆర్ మోదీకి లొంగిపోయాడని విమర్శించాడు.

First published:

Tags: CM KCR, Jeevan reddy, Telangana

ఉత్తమ కథలు