Home /News /national /

POLITICS CONGRESS KEY MEET ON PRASHANT KISHOR SONIA GANDHI TO DECIDE HIS ROLE HOURS AFTER PK CUTOFF WITH TRS CM KCR MKS

Prashant Kishor | Congress: కేసీఆర్‌కు కటీఫ్‌పై హైకమాండ్ ఖుష్.. పీకే పదవిపై Sonia Gandhi ఇలా..

సోనియా, పీకే

సోనియా, పీకే

ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ రూపంలోని చివరి అడ్డంకినీ వదిలించుకోవడంపై హైకమాండ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీకేకు పార్టీలో ఏ పదవి ఇవ్వాలనేదానిపై సోనియా గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీలుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ రూపంలోని చివరి అడ్డంకినీ వదిలించుకోవడంపై హైకమాండ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రెండ్రోజులు గడిపిన పీకే ఎట్టకేలకు కేసీఆర్ కు మర్యాదపూర్వకంగా కటీఫ్ చెప్పినట్లు నిర్ధారణ కావడంతో ఆయనకు పార్టీలో ఏ పదవి ఇవ్వాలనేదానిపై కాంగ్రెస్ ముఖ్యనేతలు మరోసారి భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం(10 జన్ పథ్) వేదికగా సోమవారం మధ్యాహ్నం జరిగిన భేటీలో పీకే వ్యూహాలతోపాటు ఆయనకు ఇవ్వబోయే పదవిపై నేతలు చర్చించుకున్నారు.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరే పార్టీకి పరోక్షంగానూ వ్యూహకర్తగా పనిచేయొద్దన్న కండిషన్ పై ప్రశాంత్ కిషోర్ రాకను కాంగ్రెస్ సీనియర్లంతా స్వాగతిస్తున్నారు. ఇతర పార్టీలతో రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలకు స్వస్తిపలకాల్సిందిగా హైకమాండ్ సూచించడంతో పీకే హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ తో రెండ్రోజులు గడిపి, మర్యాదపూర్వకంగా కటీఫ్ చెప్పారు. ఈ పరిణామం జరిగిన కాసేపటికే ఢిల్లీలో సోనియా గాంధీ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీలో పీకేకు ఇవ్వబోయే పదవి గురించి నేతలతో సోనియా సమాలోచనలు జరిపారు.

CM KCR | Prashant Kishor: షాకింగ్ ట్విస్ట్: కేసీఆర్‌కు పీకే కటీఫ్.. ఇక టీఆర్ఎస్ ఓటమే ధ్యేయం!


కాంగ్రెస్ లో చేరిన తర్వాత పీకేకు ఏం పదవి ఇవ్వాలనే అంశంతోపాటు పార్టీ పునరుద్దానం కోసం ఆయన చేసిన సూచనలపైనా నేతలతో సోనియా చర్చలు జరిపారి తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీకే సిద్దం చేసిన రోడ్ మ్యాప్ ను సైతం నేతలు మరోసారి తర్కించినట్లు సమాచారం. పీకే అంశాలే అజెండాగా జరిగిన నేటి సమావేశంలో సోనియా గాంధీతోపాటు చిదంబరం, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, రణదీప్ సుర్జేవాలా, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోని తదితరులు పాల్గొన్నారు.

Business Idea: రూ.50వేలతో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్.. నెలకు రూ.1.5 లక్షల సంపాదన..


పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఇవాళ స్పష్టత ఇచ్చిన రెండో ఘటనగా సీనియర్లతో సోనియా గాంధీ సమావేశం నిలిచింది. అంతకుముందు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పీకే-కేసీఆర్ బంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. కేసీఆర్ తో తెగదెంపులు చేసుకోడానికే పీకే హైదరాబాద్ వచ్చినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు.

Jagga Reddy: అడ్డొస్తే తొక్కిపడేస్తా: రేవంత్ ఎదుట జగ్గారెడ్డి వార్నింగ్.. అసలేం జరిగిందంటే..


‘ఇకపై టీఆర్ఎస్ కుగానీ, సీఎం కేసీఆర్ తోగానీ ప్రశాంత్ కిషోర్ కు ఎలాంటి సంబంధం ఉండదు. పీకే ఐపాక్ సంస్థకూడా టీఆర్ఎస్ కోసం పనిచేయదు. ఈ విషయంలో ముందు నుంచి నేను చెప్పిందే ఇప్పుడు జరిగింది. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తెలంగాణకు వచ్చి నాతో జాయింట్ ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ కేసీఆర్ ను ఓడిస్తామని ఆయన నోటిమాటగా మీరు(మీడియా) వినబోతున్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు అధిష్ఠానం మాటే శిరోధార్యం అవుతుంది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Kcr, Prashant kishor, Sonia Gandhi, Trs

తదుపరి వార్తలు