కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. పబ్లిక్ ప్లేసులో పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మైసూర్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మైసూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సిద్ధరామయ్యకు ఆయన వెంట ఉన్న పార్టీ వర్కర్ ఒకాయన ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అసహనం కోల్పోయిన సిద్ధారామయ్య అతని చెంపపై ఒక్కటి తగిలించారు. దీన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే సిద్ధరామయ్య ఇలా అసహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి పనులు చేస్తూ వార్తాల్లోకి ఎక్కారు.
ఈ ఏడాది జనవరిలో మైసూర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ... పార్టీ నేతను ఒక్కతోపు తోశారు. 2016లో కూడా సిద్ధారమాయ్య బళ్లారిలోని వాల్మీకి భవన్‌లో ఒక బ్యూరోక్రాట్‌ను చెంపదెబ్బ కొట్టడం దుమారం రేపింది. అయితే అప్పట్లో ఆయన ఇదంతా మీడియా తప్పుడు ప్రచారం అంటూ తోసిపుచ్చారు.
మరోవైపు కర్నాటకలో మైసూరు, కొడగు పర్యటనలో వరద అనంతర పరిస్థితిని సమీక్షించిందేకు మాజీ సీఎం బయల్దేరారు. అయితే కాంగ్రెస్ నేత ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ అరెస్టుతో ... సిద్ధరామయ్య సందర్శన ఉద్రిక్తతకు దారితీసింది. శివకుమార్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. చాలామంది కార్యకర్తలు ఆయన నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. మరికొందరు మైసూరు వచ్చిన సిద్ధరామయ్యను కలిసేందుకు భారీగా ఎయిర్ పోర్టు వద్దకు తరలివచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Dk shivakumar, Karnataka, Karnataka Politics, Mysore, Siddaramaiah