హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sonia Gandhi: రెండు రోజుల్లో ఆ సీఎం పదవిపై సోనియాగాంధీ కీలక నిర్ణయం..

Sonia Gandhi: రెండు రోజుల్లో ఆ సీఎం పదవిపై సోనియాగాంధీ కీలక నిర్ణయం..

సోనియా గాంధీ(ఫైల్ ఫొటో)

సోనియా గాంధీ(ఫైల్ ఫొటో)

Congress: జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో పోటీ చేసేందుకు గెహ్లాట్ నిరాకరించడంతో.. గెహ్లాట్‌ను సీఎం కుర్చీ నుంచి తప్పించడం కాంగ్రెస్ హైకమాండ్‌కు మరింత కష్టతరంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజస్థాన్ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలను చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎంపై 1-2 రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) రాజస్థాన్ సీఎంగా కొనసాగాలా వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తటస్థంగా ఉన్నారని కెసి వేణుగోపాల్ అన్నారు. రాజస్థాన్ రాజకీయ నాటకం రెండవ భాగం గురువారం ఢిల్లీ, జైపూర్‌లో కనిపించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోనియా గాంధీని కలిసి మూడు రోజుల క్రితం జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పారు. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది సోనియా గాంధీకే వదిలేశారు.

  అయితే రాజీనామాపై చర్చ జరగలేదు. దీంతో గెహ్లాట్ కూడా పంతం పట్టారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు వైఫల్యానికి సాకులు చెబుతూ గెహ్లాట్ కాంగ్రెస్(Congress) జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెహ్లాట్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో పోటీ చేసేందుకు గెహ్లాట్ నిరాకరించడంతో.. గెహ్లాట్‌ను సీఎం కుర్చీ నుంచి తప్పించడం కాంగ్రెస్ హైకమాండ్‌కు మరింత కష్టతరంగా మారింది.

  గెహ్లాట్‌కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్రంలో పార్టీ తిరుగుబాటు సూత్రధారి ధర్మేంద్ర రాథోడ్ జైపూర్‌లోని ఒక హోటల్‌లో మీడియాలో మాట్లాడారు. రాథోడ్ మళ్లీ సచిన్ పైలట్, అతడి వర్గం నేతలను ద్రోహులని అన్నారు. ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వ పతనం ఆమోదయోగ్యమేనని.. అయితే సచిన్ పైలట్‌ను సీఎంగా అంగీకరించబోమని పార్టీ హైకమాండ్‌ను హెచ్చరించారు.

  సోనియాకు సారీ..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన గెహ్లాట్

  Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. ముఖ్యమంత్రి పదవి కూడా డౌటే ?

  రాజస్థాన్‌లో పంచాయతీ ఎన్నికలలో పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక హోటల్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియాను కలుసుకున్నారు. జైపూర్ జిల్లా చీఫ్ పదవిని కాంగ్రెస్ కోల్పోయినట్లు ఆధారాలతో కూడిన సిడిని సమర్పించారు. రాథోడ్, మంత్రి మేఘ్వాల్ కూడా రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్ పైలట్‌కు సహకరించారని, నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. మాకెన్ పార్టీ ద్రోహులను కాపాడుతున్నారని రాథోడ్ అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Sonia Gandhi

  ఉత్తమ కథలు