హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

RSS khaki shorts : తగులబడుతున్న ఖాకీ నిక్కర్..కాంగ్రెస్ కాంట్రవర్షియల్ ట్వీట్ పై స్పందించిన RSS

RSS khaki shorts : తగులబడుతున్న ఖాకీ నిక్కర్..కాంగ్రెస్ కాంట్రవర్షియల్ ట్వీట్ పై స్పందించిన RSS

ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కర్ పై కాంగ్రెస్ పోస్ట్

ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కర్ పై కాంగ్రెస్ పోస్ట్

Congress Hits Out At RSS-BJP   : బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Congress Hits Out At RSS-BJP   : బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)సెప్టెంబర్ 7న కన్యాకమారిలో ప్రారంభించారు. 150 రోజుల పాటు సాగే పాదయాత్రలో 12 రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. ఈ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 5వ రోజున కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆరెస్సెస్ వారు ధరించే నిక్కర్‌కు మంట అంటుకున్నట్టు, దాన్నుంచి పొగ వచ్చే ఫోటోను పోస్ట్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్ఎస్ఎస్ –బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యానికి చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్ జత చేస్తూ ఇంకా 145 రోజులు ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది.

Rahul Gandhi : తమిళనాడు అమ్మాయితో రాహుల్ కి పెళ్లి..సిగ్గుపడుతున్నకాంగ్రెస్ యువరాజు!

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా బీజేపీ ,ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించింది. గతంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్(ఆర్ఎస్ఎస్) కార్య‌కర్తలు ఖాకీ క‌ల‌ర్ నిక్క‌ర్ వేసుకునే విష‌యం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు ధ‌రించే ఖాకీ నిక్కర్ నిప్పు  అంటుకున్న‌ట్లు పెట్టిన ఫోటోపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తోంది భార‌త్ జోడో యాత్ర కాదు.. అది భార‌త్ తోడో యాత్ర అంటూ మండిపడుతున్నారు. త‌క్ష‌ణ‌మే ఆ ఫోటో ట్వీట్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పెట్టిన ఈ ట్వీట్ తో భారత్ లో విద్వేషం నింపదల్చుకున్నారా అంటూ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ప్రశ్నించారు. 1984లో కాంగ్రెస్ ఢిల్లీలో ఓ నిప్పు పెట్టిందని, ఆ తర్వాత 2002లో కరసేవకుల్ని ఆ పార్టీ సానుభూతిపరులు గోద్రాలో నిప్పుపెట్టారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హింసను ప్రోత్సహిస్తోందని బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రాజేసిన నిప్పుతో గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయారని, ఇప్పుడు రాజస్తాన్,ఛత్తీస్ ఘడ్ లో కూడా అధికారం పొగొట్టుకుంటారని విమర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ మన్మోహన్ వైద్య కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ద్వేషంతో కలపాలని కోరుకుంటోందని, వారి పూర్వ తరాలు (బాప్-దాదా) కూడా సంఘ్‌ను ఆపడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మూడు రోజుల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సమన్వయ సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో వైద్య మాట్లాడుతూ.."కాంగ్రెస్ పార్టీ పూర్వ తరాలు కూడా సంఘ్ పట్ల ద్వేషాన్ని, ధిక్కారాన్ని కలిగి ఉన్నాయి. వారు (కాంగ్రెస్) ద్వేషం ద్వారా ప్రజలను కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ద్వేషంతో భారతదేశాన్ని ఏకం చేయగలరా? వారు చాలా కాలంగా మాపై ద్వేషాన్ని, ధిక్కారాన్ని కలిగి ఉన్నారు. వారి పూర్వ తరాలు (బాప్-దాదా) కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆపడానికి ప్రయత్నించారు, కాని ప్రజలు మాకు మద్దతు ఇవ్వడంతో మేము ఎదుగుతున్నాము"అని ఆయన అన్నారు.

First published:

Tags: Bharat Jodo Yatra, Bjp, Congress, Rahul Gandhi, RSS

ఉత్తమ కథలు