హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వారంతా ఢిల్లీకి రావాలని ఆదేశం..

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వారంతా ఢిల్లీకి రావాలని ఆదేశం..

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Sonia Gandhi-Rahul Gandhi: సోనియాగాంధీ, రాహుల్ గాంధీ విషయంలో ఈడీ అనుసరిస్తున్న తీరును, కేంద్రం కాంగ్రెస్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు కొద్దిరోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.

  కాంగ్రెస్ హైకమాండ్ ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజులుగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆమెను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) విషయంలో ఈడీ అనుసరిస్తున్న తీరును, కేంద్రం కాంగ్రెస్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు కొద్దిరోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) పిలుపు ఇవ్వడంతో.. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

  ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ రావాలని భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు సమాచారం అందించారని తెలుస్తోంది. మరోవైపు వీరితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు సైతం ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీ బాట పట్టబోతున్నట్టు సమాచారం.

  ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. 75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 2న కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టడంతో గత వారం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి.

  Sonia Gandhi: కాంగ్రెస్ శ్రేణులకు తీపికబురు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ

  PM Modi: ‘అగ్నిపథ్ పథకం ఆందోళనలు’.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

  దీంతో వారం క్రితం మరోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ వైద్యులు సోనియాకు ట్రీట్‌మెంట్ అందించారు. వారం తరువాత నేడు సోనియాను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate) జూన్ 23న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. త్వరలోనే ఈడీ సోనియాగాంధీని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bhatti Vikramarka, Congress, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi

  ఉత్తమ కథలు