హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Politics: నన్ను ఆ మాట అన్నందుకు మోదీపై పరువునష్టం కేసు వేస్తానని రేణుకాచౌదరి ట్వీట్‌..బీజేపీ కౌంటర్‌

Politics: నన్ను ఆ మాట అన్నందుకు మోదీపై పరువునష్టం కేసు వేస్తానని రేణుకాచౌదరి ట్వీట్‌..బీజేపీ కౌంటర్‌

Modi, Renuka Chowdhary

Modi, Renuka Chowdhary

Politics: కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన ట్వీట్‌ చేశారు. తమ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు జైలుశిక్ష విధించడాన్ని కౌంటర్ చేస్తూ రేణుకా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేస్తానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏ కారణంతో కేసు వేస్తానన్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఆపార్టీ మాజీ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chaudhary) సంచలన ట్వీట్‌ చేశారు. తమ పార్టీకి చెందిన జాతీయ నాయకుడి వ్యాఖ్యలను తప్పుగా వర్ణించడాన్ని కౌంటర్ చేస్తూ రేణుకా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi)పై పరువు నష్టం దావా వేస్తానంటూ ట్వీట్‌(Tweet)లో పేర్కొన్నారు. 2018ఏడాది పార్లమెంట్‌లో తనను మోదీ శూర్పణఖ అంటూ చేసిన ఆరోపణపై కోర్టులో పరువునష్టం దావాde(Defamation suit) వేస్తానని ...ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కోర్టులు ఎంత వేగంగా పని చేస్తాయో చూస్తానని ట్వీట్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు ఖమ్మం మాజీ ఎంపీ.

మోదీపై దావా వేస్తా..

రాహుల్‌గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పరువునష్టం కేసు వేసి శిక్ష విధించడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సాక్షాత్తు పార్లమెంట్‌లోనే శూర్పణక అని కామెంట్ చేసినందుకు ఇప్పుడు ప్రధాని మోదీపై పరువునష్టం కేసు పెడతానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మాజీ కేంద్రమంత్రి. రామాయణం సీరియల్ ప్రసారమైన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరిని కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోదీ రాజ్యసభ ఛైర్మన్‌ను కోరిన క్లిప్ ను జత చేశారు రేణుకాచౌదరి.

శూర్పణఖ అంటారా..

అయితే రేణుకచౌదరి ట్యాగ్ చేసిన వీడియోలో ప్రధాని మోదీ శూర్పణఖ అనే పదాన్ని ఉచ్చరించలేదని .. అలాంటప్పుడు పార్లమెంటులో చేసిన కామెంట్స్‌తో కోర్టుకు ఎలా వెళ్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కామెంట్స్‌ పోస్ట్ చేస్తున్నారు.2018 ఫిబ్రవరి 7వ తేదిన పార్లమెంట్‌లో విపక్ష సభ్యుల గందరగోళం మధ్య నాటి చైర్మన్‌గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు మందలించడాన్ని ఆహ్వానిస్తూ నవ్వారు. ఆమె నవ్వడం చూసి గౌరవనీయమైన చైర్మన్.. రేణుకా జీతో ఏమీ చెప్పవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రామాయణం సీరియల్ తర్వాత అవకాశం వచ్చింది. మొదటి సారి అలాంటి నవ్వు వినడం కోసం అంటూ కామెంట్ చేశారు.

Indian Railway: ఇండియన్ రైల్వేకు కోట్ల ఆదాయం తెచ్చిన ఆ ముగ్గురు ఉద్యోగులు ..ఎలాగంటే

ఆ కామెంట్ చేయలేదని వాదన..

అయితే రాహుల్‌గాంధీకి జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్ వరకు కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ పరిణామం తర్వాత లోక్‌సభ రాహుల్‌గాంధీ ఎంపీగా అనర్హుడని పేర్కొంది. రెండేళ్ల జైలుశిక్షపడినందున ఆయన అనర్హుడిగా ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాల నేతలు బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

First published:

Tags: National News, PM Narendra Modi, Rahul Gandhi, Renuka chowdhury

ఉత్తమ కథలు