హోమ్ /వార్తలు /national /

రాహుల్‌తో చంద్రబాబు, కోదండరాం భేటీ... తరువాతే కాంగ్రెస్ జాబితా

రాహుల్‌తో చంద్రబాబు, కోదండరాం భేటీ... తరువాతే కాంగ్రెస్ జాబితా

కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనా... చంద్రబాబు, కోదండరాంతో చర్చల తరువాతే ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ లేదా కాంగ్రెస్ ముఖ్యనేతలతో చంద్రబాబు, కోదండరాం ఢిల్లీలో సమావేశం కానున్నారు.

  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపుగా పూర్తికావడంతో... తొలి విడత జాబితా ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తొలి జాబితాలో 50 నుంచి 55 మంది పేర్లు ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించడానికి ముందే కోదండరాం, చంద్రబాబుతో రాహుల్ గాంధీ సమావేశమవుతారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్‌ను బట్టి గురువారం లేదా శుక్రవారం కోదండరాం, చంద్రబాబు ఆయనతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలకు కేటాయించొద్దని భావిస్తున్న సీట్లపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి ఇందులో మూడు నాలుగు సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లో తామే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, టీజేఎస్‌లకు కాంగ్రెస్ పార్టీ ఏయే స్థానాలను కేటాయించిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు... మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశంపై కూడా కీలక చర్చలు జరపబోతున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

  టీడీపీకి కేటాయించాల్సిన స్థానాలతో పాటు ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన సీట్ల అంశం కూడా రాహుల్, చంద్రబాబు భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు తమకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే... అది కూటమి స్పూర్తికి విఘాతం కలిగించినట్టు అవుతుందని మహాకూటమిలోని కాంగ్రెసేతర పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ లేదా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు, కోదండరాం భేటీ తరువాతే కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  First published:

  Tags: Chandrababu Naidu, Congress, Kodandaram, Rahul Gandhi, TDP, Telangana, Telangana Election 2018

  ఉత్తమ కథలు