Home /News /national /

POLITICS CONGRESS DOUBLE STRATEGY IN SELECTING ASHOK GEHLOT FOR PRESIDENT POST SACHIN PILOT MAY BECOME RAJASHTAN CHIEF MINISTER AK

Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ సీనియర్ నేత.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అసలు వ్యూహం అదేనా ?

ప్రియాంక, రాహుల్, సోనియా(ఫైల్ ఫోటో)

ప్రియాంక, రాహుల్, సోనియా(ఫైల్ ఫోటో)

Congress: రాజస్థాన్‌లో సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబయేతరులే ఉంటారని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ పదవి కోసం పోటీ పడేవాళ్లు కూడా గాంధీ కుటంబయేతర(Gandhi Family) వ్యక్తులే అనే విషయం అర్థమవుతోంది. అయితే గాంధీ కుటుంబం అండదండలు, అశీస్సులు అధికంగా ఉన్నవాళ్లే ఈ పదవిని దక్కించుకునే అవకాశం ఉందనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. గాంధీ ఫ్యామిలీకి మొదటి నుంచి నమ్మినవ్యక్తిగా ఉంటూ వస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌(Ashok Gehlot).. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం కోరుతోంది. సోనియాగాంధీ కచ్చితంగా చెప్పడంలో ఈ విషయంలో ఆయన ఓకే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కినా... తాను రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానంటూ ఆయన ఓ ప్రతిపాదన పెట్టారు. గురువారం కేరళలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు వచ్చిన అశోక్ గెహ్లాట్... రాహుల్ గాంధీని (Rahul Gandhi) కలిశారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను రెండు పదవులను కూడా లాగగలనంటూ చెప్పారట. అప్పటికప్పుడు ఏమీ స్పందించని రాహుల్ గాంధీ... గంటల వ్యవధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం ఒక వ్యక్తి.. ఒకే పదవి అనే నినాదంతోనే ముందుకు సాగనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉదయ్ పూర్ లో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఇదే తీర్మానాన్ని ఆమోదించామని, అందరూ ఆ తీర్మానాన్ని పాటించాల్సిందేనని చెప్పారు. ఫలితంగా అధ్యక్ష పదవి చేపడితే రాజస్థాన్ సీఎం పదవిని వదలాల్సిందేనని గెహ్లాట్‌కు రాహుల్ పరోక్షంగా చెప్పినట్టయ్యింది. అయితే అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మరో సమస్య కూడా తీరే అవకాశం ఉందని తెలుస్తోంది. Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. రాహుల్ కాదు.. ఆ ముగ్గురే పోటీ..! Amit Shah: NIA దాడులపై అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం.. PFIపై నిషేధం..? రాజస్థాన్‌లో సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. గతంలో ఓసారి బీజేపీ వైపు చూసినట్టు కనిపించిన సచిన్ పైలెట్.. రాహుల్, ప్రియాంక నచ్చజెప్పడంతో మళ్లీ మనసు మార్చుకుని హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడంతో పాటు తాము నమ్మిన వ్యక్తి అయిన అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ద్వారా రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సోనియా, రాహుల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ashok gehlot, Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు