హోమ్ /వార్తలు /national /

ఎన్నికల సిత్రాలు: ప్రత్యర్థినే ఓటు అడిగిన ముఖేష్‌గౌడ్

ఎన్నికల సిత్రాలు: ప్రత్యర్థినే ఓటు అడిగిన ముఖేష్‌గౌడ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రత్యర్థి అయిన రాజాసింగ్‌ను ఓటు అభ్యర్థించారు గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి ముఖేష్‌గౌడ్.

    ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజలను ఓట్లు అడగడం సర్వసాధారణం. ఇందుకోసం చాలామంది నేతలు చిత్రవిచిత్ర విన్యాసాలు, వేషాలు వేస్తుంటారు. తమ గెలుపు కోసం అన్నీ మర్చిపోయి అందరితో కలిసిపోతుంటారు. కానీ... ఎన్నికల్లో తమ ప్రత్యర్థిని పలకరించడానికి కూడా చాలామంది నేతలు ఇష్టపడరు. అయితే ఈ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించారు మాజీమంత్రి ముఖేష్ గౌడ్. గోషామహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ బరిలో ఉండటం దాదాపు ఖాయమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా... ఆయన తన నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తన ప్రత్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసి ఓటు వేయాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన రాజాసింగ్... ముఖేష్ గౌడ్‌పై 46 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఆయన బీజేపీ తరపున, ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయనను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీరే నాకు మద్దతు ఇవ్వాలని ముఖేష్ గౌడ్‌ను రాజాసింగ్ కోరడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి. ముఖేష్ గౌడ్, రాజాసింగ్‌ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

    First published:

    Tags: Bjp, Congress, Raja Singh, Telangana, Telangana Election 2018

    ఉత్తమ కథలు