Home /News /national /

POLITICS CONGRESS 3 DAY CHINTAN SHIVIR BEGINS AT UDAIPUR TODAY LIKELY TO EXPLORE STRUCTURAL REVAMP TO REVIVE PARTY MKS

Congress Chintan Shivir: ఉదయపూర్‌లో కాంగ్రెస్ మేధోమథనం షురూ.. 3రోజుల సదస్సులో ముఖ్య నిర్ణయాలు

కాంగ్రెస్ సీనియర్లు(పాత ఫొటో)

కాంగ్రెస్ సీనియర్లు(పాత ఫొటో)

రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అంతర్గత వ్యవస్థల ప్రక్షాళన, 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన శింతన్ శిబిర్ శుక్రవారం మొదలైంది. 3 రోజుల సదస్సులో ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇంకా చదవండి ...
136ఏళ్ల చరిత్రలో ఏనాడూ చూడనంత అధో స్థితి.. గడిచిన ఎనిమిదేళ్లుగా వరుస పరాజయాలు.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని వైనం.. అన్ని రాష్ట్రాల్లో సీనియర్ నేతల వలసలు.. ఇలా దాదాపు బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీ తన గమనంపై మేథోమథనం జరుపుతున్నది. నిర్మాణ లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు పార్టీకి మళ్లీ కొత్త ఊపిరినిచ్చేలా.. సంస్థాగతంగా భారీ ప్రక్షాళనలు, కొత్త రూపు, శ్రేణులకు నూతన నిర్దేశం ఇచ్చేలా చింతన్ శిబిర్ (Congress Chintan Shivir) నిర్వహిస్తున్నది. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అంతర్గత వ్యవస్థల ప్రక్షాళన, 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన శింతన్ శిబిర్ శుక్రవారం మొదలైంది. మూడ్రోజులపాటు జరిగే ఈ మేధోమథన సదస్సులో దాదాపు 450 మంది ముఖ్య సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు.

కాంగ్రెస్ అత్యంత కీలకంగా భావిస్తోన్న ఈ చింతన్ శిబిర్ లో.. రానున్న ఎన్నికల సవాళ్లు, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యత్యాసాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, హిందూ, ముస్లింల మధ్య విభేదాలను రెచ్చగొట్టడం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణ మొదలైన అంశాలపై లోతుగా చర్చించి.. ప్రధాన ప్రతిపక్షంగా వీటిపై ఏ విధంగా ఉద్యమించాలో హైకమాండ్ ఖరారు చేయనుంది. అంతర్గత సవాళ్లు, ఎన్నికల పరాజయాలను అధిగమించి.. సంస్థాగత పునర్నిర్మిణం ఎలా సాగాలనేదానిపైనా కీలక నిర్దేశం వెలువడనుంది.

CM KCR ఫలితం కాచుకో: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ -అర్థమేంటి? Z-కేటగిరీ : బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?


ఉదయపూర్‌ చింతన్ శిబిర్‌ను మొక్కుబడిగా జరపరాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఇదివరకే ఆదేశించిన దరిమిలా శుక్రవారం నుంచి ఆదివారం వరకు (మే 13 నుంచి 15 వరకు) జరిగే ఈ సదస్సులో కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్రధానమైన ఆరు అంశాలుగా రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువతకు సంబంధించి చర్చించాలని నిర్ణయించారు. చింతన శిబిర్ వేదికగా వెల్లడించనున్న రోడ్‌ మ్యాప్‌ కేవలం పార్టీ పునరుజ్జీవానికే గాక.. మొత్తం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

Karma : కర్మ కాటేసింది.. ప్రేయసిని చంపి.. పాతిపెడుతుండగా.. గుండెపోటుతో బొంద మీదే కుప్పకూలాడు..


కాగా, కాంగ్రెస్ ను వేధిస్తోన్న నాయకత్వ సమస్యకు చింతన్ శిబిర్ ద్వారా పరిష్కారం దక్కే అవకాశాలు కనిపించడంలేదు. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త చీఫ్ ఎంపిక వాయిదా పడుతూ వస్తున్నది. గాంధీయేతర వ్యక్తినే అధ్యక్షుడిగా ఉంచాలని రాహుల్ వాదిస్తోంటే, అన్ని రాష్ట్రాల పీసీసీసీలు, డీసీసీలు మాత్రం రాహులే నాయకుడిగా ఉండాలని తీర్మానాలు పంపాయి. చాలా కాలం పార్టీ వ్యవహారాలకూ దూరంగా ఉన్న రాహుల్.. గత రెండు మూడు నెలల నుంచి రీయాక్టివ్ కావడం, వరుసగా రాష్ట్రాల నేతలతో మాట్లాడుతూ, సభలు నిర్వహిస్తుండటంతో మళ్లీ అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారనే చర్చ మొదలైంది. అయితే, నాయకత్వ సమస్యపై చింతన్‌ శిబిర్‌లో చర్చించే అవకాశాల్లేవని కాం గ్రెస్‌ వర్గాలు తెలిపాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Rahul Gandhi, Rajasthan, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు