హోమ్ /వార్తలు /national /

TDP MP Rammohan Naidu: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంతూళ్లో ఉద్రిక్తత.. నిమ్మాడ గ్రామంలో టెన్షన్ టెన్షన్

TDP MP Rammohan Naidu: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంతూళ్లో ఉద్రిక్తత.. నిమ్మాడ గ్రామంలో టెన్షన్ టెన్షన్

ఎంపీ రామ్మోహన్ నాయుడు (ఫైల్ ఫొటో)

ఎంపీ రామ్మోహన్ నాయుడు (ఫైల్ ఫొటో)

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ పక్రియ రచ్చను క్రియేట్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. అత్యధిక పంచాయతీలను తమ మద్దతుదారుల ఖాతాలో పడాలని వైసీపీ ప్లాన్ చేస్తోంటే, అటు టీడీపీ కూడా ధీటుగానే ప్రయత్నాలు చేస్తోంది. వీలయినన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకుని అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని నిరూపించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోటబొమ్మాలి మండలంలో నిమ్మాడ గ్రామంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామంలో వైసీపీ జెండాను ఎగురవేయాలని అధికార పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడ కావడమే తాజా ఘటనలకు ముఖ్య కారణం.

టీడీపీలో కీలక నేతలయిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల స్వగ్రామం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని హస్తగతం చేసుకోవాలని వైసీపీ మద్దతుదారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లే తమకు కలిసొస్తాయని వైసీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నిమ్మాడలో వైసీపీ నామినేషన్ ప్రక్రియ గ్రామంలో ఉద్రిక్తకర పరిస్థితులను క్రియేట్ చేసింది. ఈ గ్రామంలో వైసీపీ అభ్యర్థిగా కింజారపు అప్పన్న ఆదివారం నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే ఆయన నామినేషన్ ప్రక్రియను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో నామినేషన్ కేంద్రంలోకి అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ చొచ్చుకువచ్చారు. నామినేషన్ కేంద్రం నుండి బలవంతంగా టెక్కలి కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను, సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను హరిప్రసాద్, ఆయన అనుచరలు కలిసి గెంటేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పన్నతోపాటు పలువురు పోలీసులకు కూడా ఈ ఘర్షణలో గాయాలయ్యాయి. దువ్వాడ శీను కారుపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఆయన తప్పించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ’నిమ్మాడ గ్రామం టీడీపీకి కంచుకోట. అలాంటి గ్రామంలో గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నించడం హేయం. ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలి. నిమ్మాడలో ఉద్రిక్తకర పరిస్థితులను పర్యవేక్షించండి. నిమ్మాడ ఘటనలకు కారణమయిన దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోండి‘ అంటూ చంద్రబాబు ఎన్నికల సంఘం అదనపు డీజీకి ఫోన్ చేసి చెప్పారు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Janasena, Kinjarapu Atchannaidu, Rammohan naidu, TDP, Ycp

ఉత్తమ కథలు