హోమ్ /వార్తలు /national /

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ ?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ ?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మూడు నెలల్లోనే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మూడు నెలల్లోనే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మూడు నెలల్లోనే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది.

  ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందే కొత్త జిల్లాల ఏర్పాటుపై జోరుగా చర్చ జరిగింది. ఏపీలో ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేయడానికి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని... ఇందుకు సంబంధించి కసరత్తు కూడా మొదలైందనే ఊహాగానాలు వినిపించాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మూడు నెలల్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు టాక్ కూడా వినిపించింది.

  అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త జిల్లాల ఏర్పాటు కంటే ముందుగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్‌లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైతే వచ్చే ఏడాది చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  రాష్ట్ర ఆర్థిక స్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడం, పరిపాలనలో తాము ఇంకా కుదురుకోవకపోవడం వల్లే వైసీపీ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ కారణంగానే గత బడ్జెట్‌లో ఇందుకోసం నిధులు కేటాయించలేదని తెలుస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ రెవెన్యూ శాఖమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం మండలిలో ప్రకటించారు. మొత్తానికి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.

  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP new districts, AP News, TDP, Ysrcp

  ఉత్తమ కథలు