హోమ్ /వార్తలు /national /

వైఎస్ బాటలో సీఎం జగన్... నిధుల కోసం కొత్త నిర్ణయం...

వైఎస్ బాటలో సీఎం జగన్... నిధుల కోసం కొత్త నిర్ణయం...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నాల పథకాలకు నిధుల కోసం భూములు వేలం వేయాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి బాటులోనే పయనిస్తున్నారు. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నాల పథకాలకు నిధుల కోసం భూములు వేలం వేయాలని నిర్ణయించారు. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చారు. తాను తీసుకొచ్చిన పథకాల కోసం ఆ నిధులను వెచ్చించారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ భూముల విక్రయాలకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్ బీసీసీ తో కలిసి ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు,మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో ఆరు చోట్ల,గుంటూరులో మూడు చోట్ల ఈ ఆక్షన్ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నారు. ఈ నెల 29న ఈ ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. ఆక్షన్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు నగదు చెల్లింపు తరువాత భూములపై పూర్తి హక్కులు పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆక్రమణలు,తగాదాలు లేని భూములు వేలం వేస్తున్నట్లు బిల్డ్ ఏపీ ప్రకటించింది.

మొత్తం 9 భూములను ప్రభుత్వం వేలం వేయనుంది. వాటికి రిజర్వ్ ధరను రూ.208.62 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు నగరంలోని నల్లపాడు, శ్రీనగర్ కాలనీల్లో రెసిడెన్షియల్ ప్రాంతాలు, జీటీ రోడ్డులోని కమర్షియల్ ప్రాంతాల్లో భూములు వేలం వేయనున్నారు. విశాఖలోని చినగదిలిలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో, అగనంపూడిలో రిక్రియేషన్ భూములను, ఫకీర్ టకియాలో ఉన్న ఎస్‌ఈజెడ్ భూములను వేలం వేలం వేయనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Navaratnalu, YSR

ఉత్తమ కథలు