హోమ్ /వార్తలు /national /

CM KCR: కేసీఆర్ రాజ్యసభకు పంపబోయేది వీరినేనా? -జాబితాలో వినోద్, మోత్కుపల్లి, పొంగులేటి ఇంకా..

CM KCR: కేసీఆర్ రాజ్యసభకు పంపబోయేది వీరినేనా? -జాబితాలో వినోద్, మోత్కుపల్లి, పొంగులేటి ఇంకా..

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్

బడ్జెట్ సమావేశాలు ముగియడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాలు, టీఆర్ఎస్ కార్యకలాపాలపై ఫోకస్ పెంచారు. కేంద్రంపై పోరాటానికి ప్రణాళికలతోపాటే రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపైనా గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కేసీఆర్ తిరిగి పార్టీ కార్యక్రమాలపై అదే సమయంలో కేంద్రంతో పోరుపై ఫోకస్ పెంచారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో ఉన్న సీఎం కేసీఆర్.. శనివారం హుటాహుటిన అక్కడి నుంచే అందుబాటులో ఉన్న నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న(సోమవారం) తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ భేటీకి ఆ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించడం గమనార్హం. మరోవైపు, రాజ్యసభ సభ్యుల ఎంపికపైనా కేసీఆర్ దృష్టిపెట్టారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు మూడు సీట్లు ఖాళీ కానున్న దరిమిలా కొత్త నేలతోనే వాటిని భర్తీ చేయనున్నారు..

తెలంగాణలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లనూ తిరిగి టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకోనుంది. అయితే మూడు సీట్లకు కనీసం డజనుమంది నేతలు పోటీపడుతుండటంతో వడపోత ప్రక్రియను కేసీఆర్ జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం జూన్ తొలి వారంతో ముగియనుంది. 84ఏళ్ల కెప్టెన్ ను వయసురీత్యా మరోసారి రాజ్యసభకు పంపే అవకాశాల్లేవు. టెక్నికల్ గా టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పటికీ పార్టీ నుంచి ఏడాదో దూరమైన డి.శ్రీనివాస్(డీఎస్) పదవీకాలం కూడా జూన్ లోనే ముగియనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత భర్తీ అయిన ఎమ్మెల్సీల్లో అనూహ్యంగా రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ తో రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం తెలిసిందే. ఈ మూడు ఎంపీ స్థానాలకు పార్టీలో రసవత్తరమైన పోటీ నెలకొంది.

Covid-19: కరోనా మృత్యువిలయం మళ్లీనా? -ఏడాది తర్వాత చైనాలో తొలి మరణాలు -అమెరికాలో లాక్‌డౌన్స్!

రాజ్యసభకు ముగ్గురు ఎంపీలను కేసీఆర్ ఎంచుకోవాల్సి ఉండగా, తొలి ప్రాధాన్యంగా (కరీంనగర్)మాజీ ఎంపీ, ప్రస్తుతం తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2014 నుంచి 1019 దాకా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా వ్యవహరించిన వినోద్.. ఢిల్లీలో కేసీఆర్ కు కుడి భుజంగా వ్యవహరించారు. ముఖ్యమైన రాజకీయ సమావేశాలకు సైతం కేసీఆర్ బదులుగా ఆయనే వెళ్లేవారు. కేసీఆర్ మళ్లీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన దరిమిలా వినోద్ కుమార్ ఢిల్లీలో ఉండటం అవసరమనే అభిప్రాయంతోనే రాజ్యసభ ఎంపీని చేయనున్నట్లు తెలుస్తోంది.

Modi-Kishida Meet: మోదీతో జపాన్ ప్రధాని కిషిడా భేటీ -భారత్‌లో 42బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ఆశావాహుల జాబితాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎంఏ సలీమ్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఇటీవలే చేరినప్పటికీ, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళిత బంధు పథకానికి సంబంధించిన ప్రతి సమావేశంలో, సభలో మోత్కుపల్లికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటాన్ని బట్టి ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవి ఖాయమనే వాదన వినిపిస్తోంది.

Telangana: బీజేపీ ఖాతాలో మరో విజయం.. CM KCR మెడలు వంచాం కాబట్టే శుభవార్త: బండి

ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2019 ఎన్నికల్లో హైకమాండ్ టికెట్ నిరాకరించింది. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ పొంగులేటికి బెర్తు ఖాయమని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో పొంగులేటి పార్టీని వీడాలంటూ వెళ్లిన చోటల్లా అభిమానులు నినాదాలు చేయడం జిల్లాలో సర్వసాధరణమైపోయింది. ప్రస్తుతానికి పార్టీని వీడబోనని, సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని పొంగులేటి చెబుతున్నారు. రాజ్యసభ ఎంపీ ప్రాబబుల్స్ జాబితాలో పొంగులేటి పేరు కూడా టాప్-5లోనే ఉందని తెలుస్తోంది. ఇక

CM KCRకు ఉచ్చు బిగిస్తున్నారా? కేంద్రానికి ఫిర్యాదులు.. ఒక్క సింగరేణిలోనే రూ.50వేల కోట్ల స్కామ్.. మోదీతో కోమటిరెడ్డి

కేసీఆర్ కు దీర్ఘకాల మిత్రుడైన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ నానాటికీ బలపడుతోందనే అంచనాల నడుమ ఆ ప్రాంతానికి చెందిన నేతలకు మరిన్న పదవులు ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయొచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే సురేశ్ రెడ్డి రాజ్యసభలో ఉండటం మండవకు ప్రతికూలాంశం కావొచ్చనే వాదనా ఉంది. తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, ఇటీవలే ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయిన ఎంఏ సలీమ్ పేరు కూడా టీఆర్ఎస్ రాజ్యసభ ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. మైనార్టీ కోటాలో సలీమ్ కు ఎంపీ అవకాశం దక్కొచ్చు. వీరు కాకుండా అన్ని జిల్లాల్లో కలిపి రాజ్యసభ ఆశావాహుల సంఖ్య డజను వరకు ఉండొచ్చని అంచనా.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Rajya Sabha, Trs

ఉత్తమ కథలు