హోమ్ /వార్తలు /national /

వాళ్లు చేసిందిదే... ఆర్టీసీపై బీజేపీని ఇరికించిన కేసీఆర్

వాళ్లు చేసిందిదే... ఆర్టీసీపై బీజేపీని ఇరికించిన కేసీఆర్

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్న బీజేపీపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్న బీజేపీపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్న బీజేపీపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

    తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ సమ్మె... త్వరలోనే ఆర్టీసీనే ముగిసిపోతుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్న బీజేపీపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని... కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకొచ్చిన మోటారు వెహికల్ చట్టంలో అనేక రూట్లను ప్రైవేటీకరించే హక్కును రాష్ట్రాలకు ఇచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ చట్టం ఆధారంగా తాము ఏం చేయాలో బీజేపీ నేతలు చెప్పాలని కేసీఆర్ అన్నారు.

    ప్రైవేటు ఆపరేటర్ల ఈ రంగంలోకి రావడం వల్ల ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని స్పష్టం చేశారు. తమపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసిన బీజేపీకి హుజూర్ నగర్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ పరిపాలిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

    First published:

    Tags: CM KCR, Rtc jac, Telangana, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు