హోమ్ /వార్తలు /national /

కేసీఆర్ వ్యూహం.. మళ్లీ ఆ పార్టీతో స్నేహం

కేసీఆర్ వ్యూహం.. మళ్లీ ఆ పార్టీతో స్నేహం

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు తిరుగులేదని నిరూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

  తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో.. ఎవరితో స్నేహం చేస్తారో చెప్పడం కూడా అంత ఈజీ కాదు. తాజాగా సీఎం కేసీఆర్ ఓ రాజకీయ పార్టీని అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే ఊహాగానాలు మొదలయ్యయి. శుక్రవారం తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని స్వయంగా తన నివాసానికి పిలిపించుకుని భేటీ అయ్యారు కేసీఆర్. సీపీఐ నాయకుడిని కేసీఆర్ ఇంత సడన్‌గా పిలిచి మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అయితే సీపీఐను దగ్గర చేసుకోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకే చాడ వెంకట్ రెడ్డిని పిలిచి మాట్లాడారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు తిరుగులేదని నిరూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి చెక్ చెప్పాలని ఆయన యోచిస్తున్నారు. అందుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని నిర్ణయించుకున్న కేసీఆర్... ఈ క్రమంలోనే సీపీఐను దగ్గర తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గతంలోనే ఉప ఎన్నికల సందర్భంగా సీపీఐతో స్నేహం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి.

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సీపీఐ మద్దతు తీసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించింది. అయితే అది సాధ్యంకాలేదు. అయినా టీఆర్ఎస్ అక్కడ ఘన విజయం సాధించింది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. సీపీఐతో మరోసారి స్నేహం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి.. సీపీఐ నేతతో సీఎం కేసీఆర్ ఇంత సడన్‌గా భేటీ కావడం వెనుక కారణం ఏంటన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, CPI, Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు