హోమ్ /వార్తలు /national /

KCR: కేసీఆర్ మౌనం.. ఆ సీనియర్ నేత పొలిటికల్ కెరీర్ మళ్లీ డైలమాలో పడిపోయినట్టేనా ?

KCR: కేసీఆర్ మౌనం.. ఆ సీనియర్ నేత పొలిటికల్ కెరీర్ మళ్లీ డైలమాలో పడిపోయినట్టేనా ?

కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు(ఫైల్ ఫోటో)

కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు(ఫైల్ ఫోటో)

Telangana: దళితబంధు కచ్చితంగా అమలు చేస్తామని.. మీడియా సమావేశంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన కేసీఆర్.. ఆ తరువాత దీనిపై మళ్లీ సమీక్ష కూడా నిర్వహించలేదు.

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పొలిటికల్‌గా లిఫ్ట్ ఇస్తారో ఊహించడం కష్టం. తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కొందరు నేతలకు పదవులు ఇస్తారని.. ఈ కారణంగానే కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి వంటి వాళ్లు ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవి పొందారని రాజకీయవర్గాలు చెబుతుంటాయి. అయితే కేసీఆర్ తమకు కచ్చితంగా మంచి పదవి ఇస్తారని ఆశించిన ఓ సీనియర్ నేత పరిస్థితి మళ్లీ డైలమాలో పడిపోయిందనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆ నేత మరెవరో కాదు. కొంతకాలం క్రితం టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మోత్కుపల్లి.. కేసీఆర్ దళితబంధు పథకం పెట్టడం గొప్ప విషయం అంటూ ఆయనను కీర్తించారు.

  ఈ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు మోత్కుపల్లి. అయితే టీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ముందే మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ దళితబంధు పథకంపై నిర్వహించిన పలు సమీక్షల్లో పాల్గొన్నారు. మోత్కుపల్లి నర్సింహులు సేవలను తమ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని.. ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని సీఎం కేసీఆర్ ఆయన చేరిక సందర్భంగా చెప్పారు.

  అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. దానికి చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులును నియమించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. ఆ పదవికి కేబినెట్ హోదా ర్యాంకు కూడా కల్పించాలని భావిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత సీఎం కేసీఆర్ దళితబంధు పథకం గురించి పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు లేవు.

  Telangana: కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఈటల బీజేపీకి అలాంటి సలహా ఇచ్చారా ?

  Revanth Reddy: అలా జరగకుండా చూడండి.. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

  Egg: కోడి గుడ్లతో ఇలా చేయండి.. ఇక మీ అందానికి తిరుగుండదు..

  దళితబంధు కచ్చితంగా అమలు చేస్తామని.. మీడియా సమావేశంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన కేసీఆర్.. ఆ తరువాత దీనిపై మళ్లీ సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈ అంశంపై విపక్షాలు కూడా కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నాయి. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా.. తనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్న పదవి వస్తుందని భావించిన మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్‌ కచ్చితంగా తనకు న్యాయం చేస్తారని.. తన విషయంలో ఏం చేయాలనే దానిపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉందని మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టు తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Motkupalli Narasimhulu, Telangana

  ఉత్తమ కథలు