హోమ్ /వార్తలు /national /

TSRTC Strike| ఆర్టీసీపై వారంలో కీలక నిర్ణయం... కేసీఆర్ సంచలన ప్రకటన

TSRTC Strike| ఆర్టీసీపై వారంలో కీలక నిర్ణయం... కేసీఆర్ సంచలన ప్రకటన

రాబోయే వారంలో కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. దాదాపు 5 వేలకు పైగా ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని తెలిపారు.

    తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీపై వారంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. కచ్చితంగా ఆర్టీసీ ప్రస్తుతం ఉన్నట్టుగా ఉండదని ఆయన అన్నారు. రాబోయే వారంలో కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. దాదాపు 5 వేలకు పైగా ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని తెలిపారు. ఒకే ఒక్క సంతకంతో ఈ రకమైన నిర్ణయం తీసుకునే హక్కు ముఖ్యమంత్రిగా తనకు ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సంస్థను నాశనం చేశాయని కేసీఆర్ అన్నారు. వారి సమ్మె కారణంగా ఆర్టీసీ బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మె ఇదే రకంగా కొనసాగితే... తాము కూడా దీనిపై ఏదో ఒక రకమైన నిర్ణయం తీసుకోక తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    First published:

    Tags: CM KCR, Rtc jac, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు