హోమ్ /వార్తలు /national /

బీజేపీ ఎంపీలే టార్గెట్... రంగంలోకి కేసీఆర్

బీజేపీ ఎంపీలే టార్గెట్... రంగంలోకి కేసీఆర్

సీఎం కేసీఆర్(ఫైల్ పోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ పోటో)

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ లోక్ సభ పరిధిలోని మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ ఖాతాలో పడాలని కేసీఆర్ భావిస్తున్నారు.

  లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని చాలా తక్కువగా అంచనా వేసి దెబ్బతిన్నామనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్... మరోసారి అలాంటి తప్పు జరగకూడదనే గట్టి అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్‌కు కంచుకోట లాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించిన టీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల నాటికి ఎంపీ సీటును కోల్పోవాల్సి వచ్చింది.

  తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వినోద్ ఓడిపోవడం కేసీఆర్‌కు నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలోనే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ లోక్ సభ పరిధిలోని మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ ఖాతాలో పడాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ స్థానాల్లోని మున్సిపాలిటీలకు సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలను కేసీఆర్ తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం సాధించడం ద్వారా బీజేపీ ఎంపీల దూకుడుకు చెక్ చెప్పొచ్చనే భావనలో ఉన్న గులాబీ బాస్... ఇందులో భాగంగానే ముందుగా కరీంనగర్ జిల్లాలో పర్యటించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారని పలువురు చర్చించుకుంటున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Adilabad, Bjp, CM KCR, Karimangar, Nizamabad, Trs

  ఉత్తమ కథలు