హోమ్ /వార్తలు /national /

K Chandrashekar Rao: దళితబంధు అమలు కోసం కొత్త పదవి.. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ?

K Chandrashekar Rao: దళితబంధు అమలు కోసం కొత్త పదవి.. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: మార్చిలోపు కొందరికీ.. ఆ తరువాత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 20000 కోట్ల పెట్టి అనేక మంది దళిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ. 1000000 నగదు సాయాన్ని అందజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని దళితులందరికీ అందజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ పథకం అమలు తీరు తెన్నులపై సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఎప్పుడు ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామనే అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టం ఇచ్చారు. మార్చిలోపు కొందరికీ.. ఆ తరువాత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 20000 కోట్ల పెట్టి అనేక మంది దళిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ. 1000000 నగదు సాయాన్ని అందజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. దీని అమలు కోసం ఓ చైర్మన్ పదవి సృష్టించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు గతంలో వార్తలు వచ్చాయి.

  దళితబంధు సమీక్షా సమావేశంలోనూ మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చున్నారు. దీంతో ఆయనకు కీలక పదవి రాబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా నేడు సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిసిన మోత్కుపల్లి నర్సింహులు.. ఆయన అసెంబ్లీలో ఉన్నంత సేపు అక్కడే ఉన్నారు. దళితబంధు పథకంపై ఆయనతో చర్చించారు. దీంతో మోత్కుపల్లికి దళితబంథు అమలు కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

  telangana, telangana government, CM KCR, Telangana Cabinet meeting,
  కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు(ఫైల్ ఫోటో)

  అంతకంటే ముందు బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలోనే టీఆర్ఎస్‌లో చేరతారని.. ఆ సమయంలోనే మోత్కుపల్లికి ఇవ్వనున్న కీలక పదవి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల క్రితమే మంత్రి పదవి దక్కించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చక్రం తిప్పిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహాలు.. కొన్నేళ్ల నుంచి రాజకీయంగా ఇబ్బందిపడుతున్నారు.

  Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

  KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

  ఈ క్రమంలోనే దళితబంధు పథకాన్ని ప్రశంసించి సీఎం కేసీఆర్ దృష్టిలో పడ్డారు మోత్కుపల్లి. రాజకీయంగానూ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో దూకుడగా వ్యవహరించిన మోత్కుపల్లి నర్సింహులును పార్టీలో చేర్చుకుని విపక్షాలకు గట్టి కౌంటర్ ఇప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చాలాకాలంగా రాజకీయంగా కాస్త వెనుకబడినట్టు కనిపించిన మోత్కుపల్లి నర్సింహులు.. కీలక పదవి దక్కితే మళ్లీ తనదైన శైలిలో దూసుకుపోయే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Dalitha Bandhu, Motkupalli Narasimhulu, Telangana

  ఉత్తమ కథలు