హోమ్ /వార్తలు /national /

TSRTC Strike : నేడే ఆర్టీసీతో చర్చలు... సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

TSRTC Strike : నేడే ఆర్టీసీతో చర్చలు... సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

మొత్తం 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలను కమిటీ తమ నివేదికలో పొందుపరిచింది. ప్రతీ డిమాండ్‌కు పరిష్కార మార్గంతో పాటు దానికి సంబంధించిన ప్రతికూలతలను నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పూర్తిగా పరిశీలించిన కేసీఆర్.. నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

    ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. నేటి ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్‌భవన్ లేదా రవాణా శాఖ కార్యాలయంలో చర్చలు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ,ఈడీ కమిటీ సభ్యులతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన పరిశీలించారు. మొత్తం 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలను కమిటీ తమ నివేదికలో పొందుపరిచింది. ప్రతీ డిమాండ్‌కు పరిష్కార మార్గంతో పాటు దానికి సంబంధించిన ప్రతికూలతలను నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పూర్తిగా పరిశీలించిన కేసీఆర్.. నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు.

    ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి కాబట్టి.. నేటి చర్చలకు యూనియన్ సంఘాలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ్టి చర్చలు ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కాగా,ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి 22వ రోజుకు చేరింది. హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు కూడా ఘాటుగా స్పందించాయి. దీంతో ఆర్టీసీ సమ్మె పరిష్కారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సానుకూల వాతావరణానికి ముందడుగు వేసినట్టయింది.

    First published:

    Tags: CM KCR, RTC Strike, Telangana, TSRTC Strike

    ఉత్తమ కథలు