Home /News /national /

POLITICS CM KCR FACE BIG BLOW AS ANTI BJP 13 PARTY OPPOSITION ISOLATES TRS AND NON CONGRESS FEDERAL FRONT MAY NOT HAPPEN MKS

CM KCR : కేసీఆర్‌కు భారీ షాక్.. గులాబీ బాస్ బీజేపీ వ్యతిరేకి కాదా! -ఫెడరల్ ఫ్రంట్ ఫసక్?

కేసీఆర్, మోదీ

కేసీఆర్, మోదీ

కేసీఆర్ నిజంగా కమలం ఐడియాలజీని తృణీకరిస్తారనో, టీఆర్ఎస్ అచ్చమైన బీజేపీ వ్యతిరేక పార్టీ అనో గుర్తింపు దక్కకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోందిప్పుడు. కాంగ్రెస్‌ లేని బీజేపీయేతర ఫ్రంట్‌ అసాధ్యమని విపక్షాలు స్పష్టం చేశాయి.

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేసేదాకా నిద్రపోనని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తానని యుద్ధభేరి మోగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీ, ఇంకా జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలకు వెళ్లి కీలక నేతలనూ కలిసొచ్చారు. టీఆర్ఎస్ ఢిల్లీలో నిర్వహించిన దీక్షలోనూ స్వయంగా పాల్గొన్నారు. కానీ ఇంత చేసినా కేసీఆర్ నిజంగా కమలం ఐడియాలజీని తృణీకరిస్తారనో, టీఆర్ఎస్ అచ్చమైన బీజేపీ వ్యతిరేక పార్టీ అనో గుర్తింపు దక్కకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోందిప్పుడు. బీజేపీ విధానాలను, ప్రధాని మోదీ తీరును తీవ్రంగా ఖండిస్తూ 13 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరు లేకపోవడం టీఆర్ఎస్ ప్రతిష్టకు ఇబ్బందికలిగించే అంశమేననే వాదన వినిపిస్తోంది.

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్నాళ్లూ వాదిస్తూ, ప్రయత్నిస్తూ వచ్చిన బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు ఇక ముగిసిన అధ్యాయం కాబోతోందనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ కల అయిన కాంగ్రెస్‌ లేని బీజేపీయేతర ఫ్రంట్‌ అసాధ్యమని దాదాపు అన్ని ప్రతిపక్షాలూ తేల్చేశాయి. దేశంలో చెలరేగుతున్న మతహింస, విద్వేషాలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రస్తావిస్తూ 13 ప్రధాన ప్రతిపక్షాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో టీఆర్ఎస్ కు చోటు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ వ్యతిరేక కూటమి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన చేస్తున్న కేసీఆర్‌ ను పూర్తిగా పక్కన పెట్టేయడంపై జాతీయ మీడియాలోనూ భారీ ఎత్తున కథనాలు వచ్చాయి.

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!


చాలా కాలం పాటు కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూ వచ్చిన బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకుని, బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్ ప్రాముఖ్యతను అనివార్యంగా అంగీకరిస్తున్న వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ఇదివరకు సమావేశమైన శరద్ పవార్(ఎన్సీపీ), ఎంకే స్టాలిన్(డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం) ఇప్పటికే కాంగ్రెస్ లేని బీజేపీయేతర కూటమికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వ సారధి ఉద్దవ్ ఠాక్రే(శివసేన)సైతం కేసీఆర్ ప్రతిపాదనల్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు చర్యలతో వెల్లడైంది. ఇప్పుడు..

Ilaiyaraaja: ఇళయరాజాకు బీజేపీ రాజ్యసభ సీటు! -ఇటీవలే మోదీని పొగిడిన మ్యూజిక్ మెస్ట్రో


ఢిల్లీలో కనీసం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ అవసరమైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదీగాక,

Business Idea: కనీసం రూ.5వేలతోనూ ప్రారంభించి నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చిలా..


ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ ఇప్పటిదాకా కాంగ్రెస్ తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప..
బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయని విషయాన్ని, కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదిస్తోన్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్-టీఆర్ఎస్ ల బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్నను లేవనెత్తినట్లున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Congress, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు