హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ ఉద్యోగులకే ప్రైవేట్ పర్మిట్లు.. కేసీఆర్ మదిలో మాట..

ఆర్టీసీ ఉద్యోగులకే ప్రైవేట్ పర్మిట్లు.. కేసీఆర్ మదిలో మాట..

కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని నిన్న జరిగిన సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఉన్నపళంగా సంస్కరణలు తేవాల్సి వస్తే.. ఆర్టీసీ ఉద్యోగులకే పర్మిట్లు ఇద్దామని భావించినట్లు తెలిపారు. ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేస్తే నలుగురు ఐదుగురికి కలిపి పర్మిట్ ఇద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని వెల్లడించారు కేసీఆర్.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో ఆర్టీసీ కథ ప్రస్తుతానికి సుఖాంతమైంది. ఆర్టీసీ కార్మికులంతా రేపటి నుంచి విధుల్లోకి హాజరుకావచ్చని ప్రకటించారు సీఎం కేసీఆర్. యూనియన్ల మాయలో పడి చెడిపోవద్దని సూచించారు. క్రమశిక్షణగా పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు కూడా ఇచ్చే అవకాశముందని తెలిపారు. ఐతే ఆర్టీసీలో ప్రైవేట్ పర్మిట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఒకవేళ ఉన్నపళంగా సంస్కరణలు తేవాల్సి వస్తే.. ఆర్టీసీ ఉద్యోగులకే పర్మిట్లు ఇద్దామని భావించినట్లు తెలిపారు. ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేస్తే నలుగురు ఐదుగురికి కలిపి పర్మిట్ ఇద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని వెల్లడించారు కేసీఆర్.

  ప్రజలకు మెరుగైన రవాణా ఇవ్వాల్సిన మాపై బాధ్యత ఉంది. ప్రైవేట్ పర్మిట్లను పెట్టుబడిదారులకు ఇవ్వదలచుకోలేదు. షావుకారులకు ఇవ్వదలచుకోలదు. ఒకవేళ ఉన్నపళంగా సంస్కరణలు తెస్తే ఆర్టీసీలో కొద్ది మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే నలుగురైదురికి కలిపి పర్మిట్లు ఇద్దామనుకున్నాం. అంతగొప్పగా వెళ్దామనుకున్నాం. కార్మికుల పట్ల దురుద్దేశపూర్వకంగా మేం ఆలోచన చేయలేదు.
  సీఎం కేసీఆర్

  వెంటనే పర్మిట్లు ఇచ్చి గందరగోళం సృష్టించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు కేసీఆర్. ఉద్యోగ భద్రత, యాజమాన్యం వేధింపులు ఉండకూడదని కోరుకుంటే తప్పు లేదని... కానీ క్రమశిక్షణారాహిత్యంతో ఉంటే కార్మికులను ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. ఒక తెలంగాణ బిడ్డగా.. ఒక పెద్దన్నగా కార్మికులను కాపాడే ఉద్దేశం తనకుందన్నారు కేసీఆర్. డిపోకి ఇద్దరిని చొప్పున తీసుకొని వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ సమస్యలపై ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను పిలిచి చర్చలు జరుపుతానని తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Telangana, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు