హోమ్ /వార్తలు /national /

CM KCR: కేంద్రం నుంచి రూపాయి రాలేదు.. మండిపడ్డ సీఎం కేసీఆర్

CM KCR: కేంద్రం నుంచి రూపాయి రాలేదు.. మండిపడ్డ సీఎం కేసీఆర్

అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలనుంచి వాక్సీన్లు మెడిసిన్ ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నామని.. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలనుంచి వాక్సీన్లు మెడిసిన్ ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నామని.. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Telangana: దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమని కేసీఆర్ ఆరోపించారు.

  కేంద్రం ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప.. రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకోవడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్రానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అనే విషయంలో మరోసారి నిరూపణ అయిందని వ్యాఖ్యానించారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందని... అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. దీని బట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమని కేసీఆర్ ఆరోపించారు.

  అంతకుముందు కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక స్థితి ఏ రకంగా ఉందనే సీఎం కేసీఆర్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి.

  వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.9,725 కోట్లకు గాను, రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ.802 కోట్లు కోత పడే అవకాశం ఉంది. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Hyderabad Floods, Telangana

  ఉత్తమ కథలు