హోమ్ /వార్తలు /national /

K Chandrasekhar Rao- గులాబీ బాస్ పక్కా స్కెచ్.. ప్రత్యర్థి పార్టీలకు షాకిచ్చేలా కేసీఆర్ నమ్ముకున్న ఒకే ఒక్క వ్యూహం..

K Chandrasekhar Rao- గులాబీ బాస్ పక్కా స్కెచ్.. ప్రత్యర్థి పార్టీలకు షాకిచ్చేలా కేసీఆర్ నమ్ముకున్న ఒకే ఒక్క వ్యూహం..

బల్కం పేట అమ్మవారికి తలసాని సమర్పించిన ఈ చీరను రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా చేయించారు.  ఇందుకోసం కూన వెంకటేష్ గౌడ్ కూడా కాస్త విరాళం ఇచ్చారు.

బల్కం పేట అమ్మవారికి తలసాని సమర్పించిన ఈ చీరను రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా చేయించారు. ఇందుకోసం కూన వెంకటేష్ గౌడ్ కూడా కాస్త విరాళం ఇచ్చారు.

రాజకీయ నేతల వ్యూహాలు కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అవుతుంటాయి. చాలాసార్లు అడ్డంగా బోల్తా కొట్టేస్తాయి. అందుకే అంటుంటారు రాజకీయం అనేది ఓ చదరంగం అని. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM K Chandrasekhar Rao) మాత్రం ఎప్పుడూ ఒకే వ్యూహాన్ని నమ్ముకుంటుంటారు.

ఇంకా చదవండి ...

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నేతలు వ్యూహాలను మార్చుకుంటూ ఉంటారు. ఆ వ్యూహాలు కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు అడ్డంగా బోల్తా కొట్టేస్తాయి. అందుకే అంటుంటారు రాజకీయం అనేది ఓ చదరంగం అని. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం ఎప్పుడూ ఒకే వ్యూహాన్ని నమ్ముకుంటుంటారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలోనైనా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చలేదు. ఒకే వ్యూహాన్ని అనేకసార్లు రిపీట్ చేస్తూ విజయబావుటా ఎగరవేస్తున్నారు. ప్రత్యర్థులకు కూడా అంతుచిక్కని ఆ విజయ రహస్యమేంటో, ప్రతీసారి ఫాలో అయ్యే రాజకీయ వ్యూహమేంటో సోమవారం (ఫిబ్రవరి 17న) కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకోండి మరి.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా.?

సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ స్వరాష్ట్ర సిద్ధికై టీడీపీకి గుడ్ బై చెప్పి 2001వ సంవత్సరం ఏప్రిల్ 27న కేసీఆర్ ’తెలంగాణ రాష్ట్ర సమితి‘ పార్టీని ప్రకటించారు. తనతో కలిసి వచ్చే నాయకులను అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ఉదృతం చేశారు. అయితే పోరాటాలతోపాటు రాజకీయాల ద్వారా కూడా తెలంగాణను సాధించొచ్చన్నది కేసీఆర్ నమ్మిన సిద్ధాతం. అందుకే ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రతీ గ్రామానికి తెలంగాణ ఉద్యమాన్ని చేరవేయడానికి ఆయన ఒకే ఒక్క వ్యూహాన్ని నమ్ముకున్నారు. అదే ’రాజీనామా వ్యూహం‘.

సాధారణంగా రాజకీయాల్లో ఉన్న నేతలు ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరొకలా మాట్లాడుతుంటారు. పదవుల కోసం మాట మార్చేస్తుంటారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం కంటే తమకు పదవులు ఎక్కువ కాదన్న అభిప్రాయాన్ని ప్రతీ తెలంగాణ పౌరుడికి తెలియాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదురైన ప్రతీ సారి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారు. ఉప ఎన్నికలకు వెళ్లారు.

ఇది కూడా చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇది మరీ విచిత్రం.. ఆ గ్రామంలో సర్పంచ్ బరిలో ఉన్న ఇద్దరికీ ’పేర్ల‘ తలనొప్పి..!

తెలంగాణలో గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉప ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ ఫాలో అయిన రాజీనామాల వ్యూహమే అందుకు ప్రధాన కారణమన్నది వేరుగా చెప్పనవసరం లేదు. 2001లో పార్టీ పెట్టిన తర్వాత 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ 26 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. మళ్లీ 2009లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని 45 సీట్లలో పోటీ చేసి 11 ఎమ్మెల్యే సీట్లను గెలిచారు. 2010లోనూ, 2011లోనూ, 2012వ సంవత్సరంలో రెండు సార్లు టీఆర్ఎస్ వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతీసారి గ్రామగ్రామాన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఒకటి రెండు సార్లు మినహాయిస్తే ప్రతీసారి కేసీఆర్ వ్యూహమే ఫలించింది.

అందుకే ఉద్యమంలో తనను గెలిపించిన రాజీనామా వ్యూహాన్ని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వదిలిపెట్టలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారానికి ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నా సరే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అధికారంలో ఉన్నవారికి ఒక్క గంట సమయం కూడా ఎంతో ముఖ్యమే. కానీ ఆరు నెలల పదవీ కాలాన్ని కేసీఆర్ వదిలేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలుగు నాట పెద్ద చర్చే జరిగింది. ఆయన గెలుపుపై తీవ్రమైన చర్చే జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోనుందని కొన్ని సర్వేలు కూడా వెల్లడయ్యాయి. కానీ ఎవరూ ఊహించని రీతిలో 2014వ సంవత్సరంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక సీట్లను తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. దీంతో మరోసారి ఆయన రాజీనామా వ్యూహం ఫలించినట్టయింది.

First published:

Tags: Bandi sanjay, CM KCR, KCR Return Gift, Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు