ఎన్నికల కమిషన్ మీద పోరాటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటికే ఈసీతో లేఖల యుద్ధం చేస్తున్నారు. వరుసగా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఢిల్లీలో ధర్నా చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. చంద్రబాబునాయుడు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో కలసి అక్కడే మూడు రోజులు ఉంటారు. ఆ తర్వాత ఆయన తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఈవీఎంలను తీసేసి పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ, మరో 20 పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పేపర్ బ్యాలెట్లు తీసుకువస్తే ఎన్నికల ఫలితాలు రావడానికి ఎనిమిది రోజులు పడతాయని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజాగా మరోసారి టీడీపీ, మరో 20 పార్టీలు కలసి సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశాయి. కనీసం 50 శాతం వీవీప్యాట్ల యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తన డిమాండ్‌కు మద్దతు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వేదికగా పోరాటాలు చేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించారు. పలు జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించారు. మరోసారి కూడా పాత ఫార్ములానే అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే, ఏయే పార్టీలు ఆయనకు బాసటగా నిలుస్తాయనే విషయం చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Election Commission of India, Lok Sabha Election 2019, Supreme Court, TDP