హోమ్ /వార్తలు /national /

టీడీపీ ఎంపీ తలపై చంద్రబాబు ముళ్లకిరీటం... విజయసాయిరెడ్డి

టీడీపీ ఎంపీ తలపై చంద్రబాబు ముళ్లకిరీటం... విజయసాయిరెడ్డి

అయితే అది టీడీపీకి చెందిన కేఈ కృష్ణమూర్తి కుటుంబమా లేక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబమా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఏపీలో టీడీపీ బలోపేతం కోసం చంద్రబాబు మదిలోని కొత్త ప్లాన్ ఎంతవరకు అమలు చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

అయితే అది టీడీపీకి చెందిన కేఈ కృష్ణమూర్తి కుటుంబమా లేక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబమా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఏపీలో టీడీపీ బలోపేతం కోసం చంద్రబాబు మదిలోని కొత్త ప్లాన్ ఎంతవరకు అమలు చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తలపై చంద్రబాబు ముళ్లకిరీటం పెట్టబోతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుగా కళా వెంకట్రావు స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును నియమించబోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ చేతగానితనం వల్లే 32 సంవత్సరాల రామ్మోహన్ నాయుడికి ముళ్లకిరీటం పెడుతున్నారని అన్నారు. ‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మరో బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే అర్థం అవుతోంది. కళా వెంకట్రావు ఉత్తరాంధ్రకు చెందిన నేత. మరోసారి కూడా ఉత్తరాంధ్రకు చెందిన యువనేతకే పగ్గాలు అప్పగించనున్నట్టు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను వైసీపీ 22 సీట్లు గెలుచుకుంది. టీడీపీ నుంచి ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. అందులో విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళంనుంచి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడుకు ఈ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు పగ్గాలు ఇస్తారనే వాదన తెరపైకి వచ్చింది.

First published:

Tags: Andhra Pradesh, Rammohan naidu, Tdp, Vijayasai reddy

ఉత్తమ కథలు