హోమ్ /వార్తలు /national /

కుప్పంకు లోకేశ్... చంద్రబాబు సరికొత్త వ్యూహం

కుప్పంకు లోకేశ్... చంద్రబాబు సరికొత్త వ్యూహం

త్వరలోనే అంటే మరో మూడు నాలుగు నెలలలోపే ఆయన భీమిలీ ద్వారా తన కార్యకలాలపను విస్తరిస్తారని ప్రచారరం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని.. ఒక వేల లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిన బాలయ్య మరో అల్లుడు భరత్ ను భీమిలి నుంచి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి..

త్వరలోనే అంటే మరో మూడు నాలుగు నెలలలోపే ఆయన భీమిలీ ద్వారా తన కార్యకలాలపను విస్తరిస్తారని ప్రచారరం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని.. ఒక వేల లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిన బాలయ్య మరో అల్లుడు భరత్ ను భీమిలి నుంచి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి..

గత అసెంబ్లీ ఎన్నికల్లోనే లోకేశ్ కుప్పం నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. చంద్రబాబు మరో నియోజకవర్గానికి మారి... తన కంచుకోట అయిన కుప్పం నుంచి తనయుడు లోకేశ్‌ను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది.

  ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే తన తనయుడు నారా లోకేశ్‌ను కుప్పం పంపించబోతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు స్వయంగా కార్యకర్తలకు వివరించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు... పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై కక్షతో కుప్పంలో అభివృద్ధి పనులను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... త్వరలోనే నారా లోకేశ్ కుప్పంలో పర్యటిస్తారని వారికి తెలిపారు. అయితే చంద్రబాబు కుప్పంలో లోకేశ్ పర్యటిస్తారని చెప్పడం వెనుక కారణం ఏమిటన్నది దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

  త్వరలోనే మున్సిపల్ సహా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుండటంతో... కుప్పంలో టీడీపీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు నారా లోకేశ్‌ను రంగంలోకి దింపేందుకు చంద్రబాబు భావిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కుప్పం మున్సిపాలిటీ సహా నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై అధికార పార్టీ ఇప్పటికే ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే టాక్ వినిపిస్తోంది.

  తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది కాబట్టి... కుప్పంపై నారా లోకేశ్ ద్వారా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో లోకేశ్‌ను చంద్రబాబు కుప్పం నుంచి బరిలోకి దింపే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే లోకేశ్ కుప్పం నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.

  చంద్రబాబు మరో నియోజకవర్గానికి మారి... తన కంచుకోట అయిన కుప్పం నుంచి తనయుడు లోకేశ్‌ను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం ఎఫ్పటిలాగే కుప్పం నుంచి బరిలోకి దిగారు. ఆయన తనయుడు లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ను కుప్పం నుంచి బరిలోకి దించేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Kuppam, Nara Lokesh, Tdp

  ఉత్తమ కథలు