హోమ్ /వార్తలు /national /

ఒకే ఒక్క మీటింగ్... లోకేశ్‌పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

ఒకే ఒక్క మీటింగ్... లోకేశ్‌పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

త్వరలోనే అంటే మరో మూడు నాలుగు నెలలలోపే ఆయన భీమిలీ ద్వారా తన కార్యకలాలపను విస్తరిస్తారని ప్రచారరం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని.. ఒక వేల లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిన బాలయ్య మరో అల్లుడు భరత్ ను భీమిలి నుంచి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి..

టీడీపీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేది లోకేశ్ అని సంకేతాలు ఇవ్వడానికే చంద్రబాబు యువనేతల సమావేశం ఏర్పాటు చేయించారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  టీడీపీలో చంద్రబాబు తరువాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరనే దానిపై చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. చంద్రబాబు రాజకీయ వారసుడు ఆయన కుమారుడు నారా లోకేశ్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేకపోయినా... టీడీపీలో మాత్రం ఈ విషయంలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అయితే తన రాజకీయ వారసుడిగా, టీడీపీని ముందుకు తీసుకెళ్లే సారథిగా నారా లోకేశ్‌ను తెర మీదకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు వేసిన సరికొత్త వ్యూహంతో భాగమే... ఇటీవల జరిగిన టీడీపీ యువనేతల సమావేశమని పలువురు చర్చించుకుంటున్నారు.

  టీడీపీ నేతల వారసులంతా కలిసి లోకేశ్ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయగా... మరికొందరు రాబోయే ఎన్నికల్లో రాజకీయవారసులుగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల యువనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరికి టీడీపీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేది లోకేశ్ అని సంకేతాలు ఇవ్వడానికే చంద్రబాబు ఈ సమావేశం ఏర్పాటు చేయించారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  భవిష్యత్తులో ఈ యువ నాయకులంతా టీడీపీ తరపున లోకేశ్ సారథ్యంలోనే ముందుకు సాగుతారనే విషయం ఈ భేటీ ద్వారా తేలపోయింది. మొత్తానికి ఒకే ఒక్క సమావేశంతో... టీడీపీ యువ నాయకులందరినీ యాక్టివ్ చేసిన చంద్రబాబు... ఇదే సమావేశం ద్వారా లోకేశ్ విషయంలోనూ వారికి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

  ఉత్తమ కథలు