హోమ్ /వార్తలు /national /

Chandrababu Suspension: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సస్పెన్షన్.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా

Chandrababu Suspension: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సస్పెన్షన్.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా

చంద్రబాబునాయుడు (FIle)

చంద్రబాబునాయుడు (FIle)

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నందుకు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. చంద్రబాబుతో పాటు 13 మంది సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు హాట్ హాట్ గా చర్చ ప్రారంభమైంది. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అయితే, నెల రోజుల్లోనే నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ నిధులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే మీద విమర్శలు గుప్పించారని జగన్ మండిపడ్డారు. అలాగే, ప్రభుత్వం చేస్తున్న పనికి మళ్లీ మళ్లీ ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీద జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆగ్రహ వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. చంద్రబాబు సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను అనుసరించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. అయితే, సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అక్కడే బైఠాయించారు. వారిని వెళ్లిపోవాలంటూ మార్షల్స్ వారిని కోరారు. అయితే, అందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ససేమిరా అన్నారు.

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్, డిసెంబర్ నుంచి..

వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?

సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు

చంద్రబాబునాయుడు

అచ్చెన్నాయుడు

బుచ్చయ్య

పయ్యావుల కేశవ్

నిమ్మల రామానాయుడు

ఏలూరిసాంబశివరావు

అశోక్

జోగేశ్వరరావు

అనగాని సత్యప్రసాద్

మంతెన రామరాజు

బాల వీరాంజనేయస్వామి

రామకృష్ణబాబు

ఆదిరెడ్డి భవానీ

గద్దె రామ్మోహన్


చంద్రబాబు వైఖరిని అధికార వైసీపీ ఖండించింది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించడాన్ని వారు తప్పుపట్టారు. అలాగే, చంద్రబాబు కళ్లు పెద్దవి చేస్తూ, వేలు చూపిస్తూ బెదిరించారంటూ జగన్ ఆక్షేపించారు. అలాగే, ఇలాంటి పనులు చేయకుండా స్పీకర్ కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ సభ్యులు కోరారు. మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

First published:

Tags: Ap assembly sessions, Chandrababu naidu

ఉత్తమ కథలు