హోమ్ /వార్తలు /national /

దుబ్బాకలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజే TRS కు కేంద్రం సర్ ప్రైజ్ గిఫ్ట్

దుబ్బాకలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజే TRS కు కేంద్రం సర్ ప్రైజ్ గిఫ్ట్

మోదీ, సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

మోదీ, సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

దుబ్బాకలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజే టీఆర్ఎస్ కు కేంద్ర ప్రభుత్వం సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఢిల్లీ వసంత్ విహార్ లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల భూమిని కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూమి అప్పగింత ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పూర్తి చేసింది.

ఇంకా చదవండి ...

  దుబ్బాక ఉప ఎన్నిక మంగళవారం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ నడుమ అనేక సార్లు యుద్ధ వాతారణం ఏర్పడింది. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. దాడులు చేసుకున్నారు. సిద్దిపేటలో పోలీసులు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకోవడంతో ఏర్పడిన వివాదం ఈ ఎన్నికల్లో మరింత హీట్ ను తారా స్థాయికి పెంచింది. ఈ సందర్భంగా సిద్దిపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడం వివాదస్పదంగా మారింది.

  ఆ సమయంలో తనపై పోలీసులు దాడి చేశారంటూ బండి సంజయ్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. అయితే ఇదంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ ఆడుతున్న నాటకంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు.

  ఇదిలా ఉంటే.. దుబ్బాకలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజే టీఆర్ఎస్ కు కేంద్ర ప్రభుత్వం సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఢిల్లీ వసంత్ విహార్ లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల భూమిని కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. ఇది టీఆర్ఎస్, బీజీపీ మధ్య ఉన్న మంచి సంబంధాలకు నిదర్శనమని పలు ప్రతిపక్షాల పార్టీలు ఆ సమయంలో విమర్శించాయి. అయితే ఆ భూమి అప్పగింత ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పూర్తి చేసింది. ఈ మేరకు కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు  జారీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bjp, Central Government, Dubbaka By Elections 2020, Trs

  ఉత్తమ కథలు