హోమ్ /వార్తలు /national /

సుజనా చౌదరికి షాక్..మూడుచోట్ల సీబీఐ సోదాలు

సుజనా చౌదరికి షాక్..మూడుచోట్ల సీబీఐ సోదాలు

సుజనా చౌదరి

సుజనా చౌదరి

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపై సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్‌తో పాటు మరో రెండు చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతున్నాయి.

    కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపై సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్‌తో పాటు మరో రెండు చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతున్నాయి. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించి సీబీఐ మరోసారి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు బిల్లులు సృష్టించి బ్యాంక్‌ల నుంచి లోన్లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను చెల్లించడం లేదంటూ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసింది. ఆ కేసులను ఈడీకి బదిలీ చేసింది. సుజనా చౌదరి కంపెనీలు ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.71కోట్లు రుణాలు పొంది ఎగవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఐదుగురు డైరెక్టర్లు, ఎండీపై బెంగళూరు సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, బెంగళూరు సహా మూడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

    First published:

    Tags: CBI, Sujana Chowdary

    ఉత్తమ కథలు