హోమ్ /వార్తలు /national /

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి సీబీఐ షాక్..

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి సీబీఐ షాక్..

అయితే రాజధాని విషయంలో ఎవరెన్ని చెప్పినా... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ పదే పదే సుజనా చౌదరి చెబుతూ వస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది.

అయితే రాజధాని విషయంలో ఎవరెన్ని చెప్పినా... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ పదే పదే సుజనా చౌదరి చెబుతూ వస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది.

బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు 2017లో సుజనా చౌదరిపై కేసు నమోదయింది. దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు జారీచేశారు.

  కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) షాక్ ఇచ్చింది. బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి విచారణకు శుక్రవారం రావాలంటూ ఆయనకు సమన్లు జారీచేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.  2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు బెంగళూరు బ్రాంచ్‌లో సుజనా చౌదరిపై కేసు నమోదయింది. దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందిగా గురువారం సీబీఐ అధికారులు సమన్లు జారీచేశారు.

  సీబీఐ సమన్లపై స్పందించిన సుజనా చౌదరి ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు. 2003 నుంచి 2014 వరకు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, స్ప్లెండింగ్ మెటల్ ప్రాడక్ట్స్, నియాన్ టవర్స్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లో ఉన్నానని తెలిపారు. ఇక 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లేని స్పష్టంచేశారు. తదుపరి చర్యలకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, CBI, Sujana Chowdary, Tdp

  ఉత్తమ కథలు