హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mamata Banerjee: ప్రధాని మోదీ కాళ్లైనా మొక్కుతా.. కానీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: ప్రధాని మోదీ కాళ్లైనా మొక్కుతా.. కానీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకైనా సిద్ధమని.. కానీ అవమానాన్ని మాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. తుపాను సమీక్షా సమావేశానికి తనతో పాటు గవర్నర్‌, బీజేపీ నేతలను ఎందుకు పిలిచారని దుమ్మెత్తిపోశారు.

బెంగాల్ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకైనా సిద్ధమని.. కానీ అవమానాన్ని మాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. తుపాను సమీక్షా సమావేశానికి తనతో పాటు గవర్నర్‌, బీజేపీ నేతలను ఎందుకు పిలిచారని దుమ్మెత్తిపోశారు.

బెంగాల్ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకైనా సిద్ధమని.. కానీ అవమానాన్ని మాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. తుపాను సమీక్షా సమావేశానికి తనతో పాటు గవర్నర్‌, బీజేపీ నేతలను ఎందుకు పిలిచారని దుమ్మెత్తిపోశారు.

ఇంకా చదవండి ...

  బీజేపీ, మమతా బెనర్జీ మధ్య మళ్లీ మాటల యుద్ధం ముదురుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. కానీ ప్రజలు అనూహ్య మెజారిటీతో మళ్లీ దీదీకే పట్టంగట్టారు. ఆ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ, టీఎంసీ మధ్య రచ్చ జరుగుతోంది. యాస్ తుపాన్‌పై ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశం ఇరువురి మధ్య చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకైనా సిద్ధమని.. కానీ అవమానాన్ని మాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. తుపాను సమీక్షా సమావేశానికి తనతో పాటు గవర్నర్‌, బీజేపీ నేతలను ఎందుకు పిలిచారని దుమ్మెత్తిపోశారు.

  ''ప్రధాన మంత్రి కార్యాలయం నన్ను అవమానపరించింది. నా ప్రతిష్టను దెబ్బతీసేలా ట్వీట్ చేసింది. ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య జరిగే తుపాను సమీక్షా సమావేశానికి గవర్నర్, బీజేపీ నేతలు ఎందుకు హాజరయ్యారు. అది నాకు అవమానంగా అనిపించింది. బెంగాల్ ప్రజల కోసం ప్రధాని కాళ్లైనా పట్టుకుంటాను. కాను అవమానాన్ని మాత్రం సహించను.'' అని శనివారం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  రెండు రోజుల క్రితం ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్‌పై యాస్ తుపాన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అక్కడ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కోల్‌కతాలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలో శుక్రవారం మమతా బెనర్జీతో సమావేశం కావాల్సి ఉంది. ఐతే కాన్ఫరెన్స్ హాలులో ప్రధాన మంత్రి మోదీ, గవర్నర్ కూర్చున్నప్పటికీ.. మమతా బెనర్జీ వెళ్లలేదు. ఆమె కోసం 30 నిమిషాల పాటు వారు వేచిచూశారు. అనంతరం మమతా బెనర్జీ వచ్చి తుపాను నష్టంపై రిపోర్టు సమర్పించి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పర్యటించారు.

  ఐతే ప్రధాని మోదీతో సమావేశానికి మమత గైర్హాజరవడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేశారని విరుచుకుపడ్డారు. వారి విమర్శలకు అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మమతా. అది సమీక్షా సమావేశం కాదని.. రాజకీయ సమావేశమని అన్నారు. అందుకే వెళ్లలేదని ఎదురుదాడికి దిగారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని గుజరాత్, ఒడిశాలో కూడా పర్యటించారని.. కానీ అక్కడ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించలేదని చెప్పారు. ఒక్క బెంగాల్లోనే ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు మమత.

  ''ప్రధాని వస్తున్నారని తెలిసి హెలికాప్టర్ దిగే స్థలానికి వెళ్లి ఎదురుచూశాం. ఆయన్ను కలిసేందుకు వెళళితే మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. 20 నిమిషాల పాటు ప్రధాని కోసం ఎదురుచూశాం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రధాని, సీఎం సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లా. కానీ హాల్‌లో ప్రధానితో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. అప్పుడు వెంటనే ప్రధానికి రిపోర్ట్ సమర్పించి.. ఆయన అనుమతితోనే బయటకు వచ్చాను. నేరుగా తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లాను.'' అని మమతా బెనర్జీ చెప్పారు.

  మరోవైపు ప్రధాని సమీక్షా సమావేశానికి సీఎం మమతతో పాటు సీఎస్ అలపన్ బంధోపాధ్యాయ్ కూడా హాజరుకాకపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిణగించింది. ఈ క్రమంలోనే ఆయన్ను కేంద్రం రీకాల్ చేసింది. ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీ స్పందించారు. బెంగాల్ ప్రజల కోసం సీఎస్ ఎంతో కష్టపడుతున్నారని.. ఆయన బదిలీని రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

  First published:

  Tags: Mamata Banerjee, Narendra modi, PM Narendra Modi, West Bengal

  ఉత్తమ కథలు