హోమ్ /వార్తలు /national /

విజయసాయిరెడ్డికి బీజేపీ హెచ్చరిక.. రఘురామకృష్ణంరాజు పేరు ప్రస్తావిస్తూ..

విజయసాయిరెడ్డికి బీజేపీ హెచ్చరిక.. రఘురామకృష్ణంరాజు పేరు ప్రస్తావిస్తూ..

విజయసాయిరెడ్డి (File)

విజయసాయిరెడ్డి (File)

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి బీజేపీ హెచ్చరిక జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి బీజేపీ హెచ్చరిక జారీ చేసింది. కేవలం పసుపునే కాదని ఏ రంగును అయినా కూడా కాషాయంలా చేయగల సత్తా బీజేపీకి ఉందంటూ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. రఘురామకృష్ణంరాజు ఫేడ్ చేస్తున్న రంగులను కాపాడుకోవాలంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన విజయసాయిరెడ్డికి హితవు పలికారు. ఇక్కడ పసుపు అంటే దియోధర్ ఉద్దేశం పరోక్షంగా టీడీపీని ఉద్దేశించేని స్పష్టం అవుతోంది. ఎందుకంటే గతంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావుతో పాటు మరో ఎంపీ బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సునీల్ దియోధర్.. తాజాగా వైసీపీలో చిచ్చు రేపుతున్న రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావించారు. రఘురామకృష్ణం రాజు వైసీపీని ఫేడ్ అవుట్ చేస్తున్నారని చెప్పారు. అంటే, పరోక్షంగా మరికొందరు నేతలు రఘురామకృష్ణంరాజుతో కలసి కాషాయం కండువా కప్పుకొంటారా? అని రాజకీయ వర్గాల్లో సందేహాలు లేవనెత్తారు.

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈనెల 3న ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుమారు 100 పేజీల ఫిర్యాదు ప్రతిని వారు సాక్ష్యాలతో సహా అందించారు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు ఎప్పుడెప్పుడు, ఎలాంటి కామెంట్స్ చేశారు? టీవీల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియోలు, పేపర్ క్లిపింగ్స్ కూడా ఆ 100 పేజీల ఫిర్యాదులో ఉన్నాయి. వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు.. జగన్‌ మీద అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఉంటూ మిగిలిన ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఫైల్ చేశామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, MP raghurama krishnam raju, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు