కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులకు మోదీ సర్కార్ కసరత్తులు చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం శాఖల్లో 4 శాఖలు మినహా అన్ని శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ మార్పులు చేపడతారని తెలుస్తుంది. అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినేట్ లో పెద్ద పీట వేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ (Telangana)నుంచి మరొకరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం లేకపోలేదు. అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వారిని కేబినేట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..
ఏపీ, తెలంగాణ సహా పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలువురిని కేబినెట్ లోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తుందని సమాచారం. అలాగే బడ్జెట్ లో కూడా ఆయా రాష్ట్రాలకు ఊరట కలిగించేలా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని, ఇప్పటికే వాళ్లకు సంకేతం ఇచ్చినట్లు తెలుస్తుంది.
తెలంగాణ నుంచి అతనికి చోటు?
ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్ర మంత్రిగా కేబినేట్ లో కొనసాగుతున్నారు. అయితే మరొకరిని కేబినెట్ లోకి తీసుకోవాలని సర్కార్ చూస్తుంది. ఇక రేసులో లక్ష్మణ్ (Laxman)ముందజలో ఉండగా..ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును (Mp Soyam Bapu rao) కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆదివాసీల పోదు భూముల అంశం తెలంగాణ సర్కార్ కు తలనొప్పిగా మారింది. దీనిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కేంద్రం సోయం బాపూరావు (Mp Soyam Bapu rao) వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇకపోతే ఎల్లుండి నుండి పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు (Parliament Sessions) జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందే ఛాన్స్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Cabinet Reshuffle, India, Narendra modi, Telangana