హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Budget 2020: నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్రపతి కోవింద్

Budget 2020: నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్రపతి కోవింద్

రామ్‌నాథ్ కోవింద్

రామ్‌నాథ్ కోవింద్

ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మకమన్నారు రాష్ట్రపతి. జమ్ముకాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందుతున్నారన్నారు.

  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక బిల్లులకు గత సమావేశాలు ఆమోదం తెలిపాయన్నారు కోవింద్. ట్రిపుల్ తలాక్ సహా పలు చట్టాలను ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ దశాబ్ధం దేశాభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. మా ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట తీర్పునిచ్చారన్నారు. రాజ్యాంగానుసారం పనిచేేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మకమన్నారు. జమ్ముకాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందుతున్నారన్నారు. జమ్ముకాశ్మీర్‌లో 4400 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించామన్నారు. కర్తారాపూర్ కారిడార్ ప్రారంభించడం ఓ రికార్డ్ అన్నారు. విశిధ రంగాల్లో భారత్ విశేష ప్రగతిని సాధించిందన్నారు. దేశం మరిన్ని ఉన్నత శిఖరాల్ని అందుకుంటుందని కోవింద్ ఆశించారు. నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్రపతి. గత ఐదేళ్లలో భారత వృద్ధి మెరుగుపడిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం అన్నారు కోవింద్.

  సన్ కానా సాహిబ్ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు దేశ ప్రజలందరికి అందుతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు రాష్ట్రపతి. బోడోల అభివృద్ధి కోసం రూ.1050 కోట్లు కేటాయించానమ్నారు. స్వయం ఉపాధి రంగాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలను మిలటరీలో నియమిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 1947 తర్వాత పాక్ నుంచి వచ్చిన వారందరికీ మంచి జీవితం ఇవ్వడమే లక్ష్యమన్నారు. CAAతో బాపూజీ కల నెరవేరిందన్నారు. పాకిస్తాన్‌లో ఉండలేని హిందువులు, సిక్కులు భారత్‌కు రావచ్చని గాంధీజీయే చెప్పారన్నారు. పాకిస్తాన్ ఆ దేశంలో మైనార్టీలను టార్గెట్ చేసిందన్నారు. CAAపై రాష్ట్రపతి ప్రకటన తర్వాత సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.హింస వల్ల దేశ ప్రతిష్ఠ దిగజారుతుందన్నారు.

  కొత్తగా 65 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. పాలనలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్‌తో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్గిందన్నారు.వేయికి పైగా మందుల ధరల్ని పేదలకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు. నా ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుందన్నారు. మహిళల భద్రతకు పెద్ద పీఠ వేస్తున్నామన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు వేస్తున్నామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధితో 8కోట్లమంది రైతులు లబ్ధి పొందారన్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Budget 2020, Ramnath kovind, Union budget 2020-2021

  ఉత్తమ కథలు